Gold Price Today | పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అలాగే క్రిస్మస్ వచ్చేస్తోంది. అటుపైన కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇలా వరుస సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం. అందువల్ల మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తే.. మీకోసం అదిరే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ జువెలరీ (Jewellery) సంస్థ తనిష్క్ (Tanishq) కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. టాటా బ్రాండ్‌కు చెందిన జువెలరీ సంస్థనే తనిష్క్.
కొనుగోలుదారులకు మంచి షాపింగ్ అనుభూతి కల్పించాలనే లక్ష్యంతో తనిష్క్ కంపెనీ ఈ కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఆవిష్కరించింది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల బంగారం కొనాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 15 వరకే ఆఫర్లు ఉండొచ్చని తెలుస్తోంది.
రూ.35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ .. అదిరిపోయే ఫీచర్లతో!
తనిష్క్ కంపెనీ బంగారు ఆభరణాల కొనుగోలుపై 100 శాతం ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తోంది. అంటే మీరు పాత బంగారం తెచ్చి కొత్త బంగారం కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి తగ్గింపు ఉండదని చెప్పుకోవచ్చు. ఏ జువెలరీ సంస్థలో బంగారం కొన్నా కూడా దాన్ని తీసుకువచ్చిన తనిష్క్‌లో గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఇవ్వొచ్చు. మీ బంగారానికి సమానమైన మొత్తాన్ని మళ్లీ తనిష్క్ జువెలరీ నుంచి కొనుగోలు చేయొచ్చు.
మధ్యతరగతికి మోదీ కొత్త ఏడాది కానుక? కేంద్రం కీలక నిర్ణయం? జనవరి 1 నుంచి..
పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. 100 శాతం ఎక్స్చేంజ్ విలువ పొందొచ్చు. తనిష్క్‌లో అందుబాటులో ఉన్న వివిధ డిజైన్లలో నచ్చిన ఆభరణాలను ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది కొన్ని ఆభరణాలకే వర్తిస్తుంది. అంటే 22 క్యారెట్లకు పైన స్వచ్ఛత కలిగిన బంగారానికి మాత్రమే పూర్తి ఎక్స్చేంజ్ విలువ లభిస్తుందని గుర్తించుకోవాలి.
ఇకపోతే ఈరోజు బంగారం ధరలను గమనిస్తే.. తనిష్క్ వెబ్‌సైట్ ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 57,230 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు పది గ్రాములకు రూ. 52,470 వద్ద ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం రేటును పరిశీలిస్తే.. పది గ్రాములకు రూ. 42,920గా ఉంది. ఇకపోతే బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు మరో విషయాన్న గుర్తించుకోవాలి. ఈ రేట్లకు తయారీ చార్జీలు, జీఎస్‌టీ వంటివి అదనం అని గుర్తించుకోవాలి. అందువల్ల బంగారం ధరలో కొంత మేర వ్యత్యాసం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewellery, Gold ornmanets, Gold price, Gold rate