Fixed Deposits | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలకు (FD) ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది. దీంతో బ్యాంక్‌లో (Bank) డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చ. గతంలో కన్నా ఇకపై కస్టమర్లకు ఎక్కువ రాబడి వస్తుంది.
బ్యాంక్ ఎఫ్‌డీ రేట్ల పెంపు జనవరి 2 నుంచి అమలులోకి వస్తుంది. అంటే నేటి నుంచి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో చూస్తే.. కస్టమర్లకు 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుంది.
100 ఏళ్లు పూర్తి చేసుకున్న బ్యాంక్.. కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్!
వడ్డీ రేట్ల పెంపు తర్వాత చూస్తే.. 7 రోజుల నుంచి 120 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 5.25 శాతంగా ఉంది. 121 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6 శాతంగా లభిస్తోంది. ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7 శాతంగా ఉందని చెప్పుకోవచ్చు. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ పొందొచ్చు. మూడేళ్ల నుంజి పదేళ్ల ఫిక్స్‌డ్ డిపిజిట్లపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే అదనపు వడ్డీ రేటు బెనిఫిట్ ఉంది. వీరికి 0.5 శాతం అధిక వడ్డీ రేటు లభిస్తుంది.
కస్టమర్లకు బంపర్ బొనాంజా.. కొత్త సంవత్సరం ఆరంభంలోనే 2 శుభవార్తలు అందించిన బ్యాంక్!
బ్యాంకులు వరుసపెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పెంచుకుంటూ వెళ్లడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ నుంచి పీఎన్‌బీ వరకు చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి కూడా ఎఫ్‌డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇప్పుడు బ్యాంక్ ఎఫ్‌డీ చేసే వారికి అధిక వడ్డీ రేటు లభిస్తోంది. బ్యాంక్, మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన ఎఫ్‌డీ రేట్లు కూడా మారుతూ ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Personal Finance