అదో బూతు పురాణం... టిక్ టాక్ యాప్‌ని నిషేధిస్తున్న తమిళనాడు అసెంబ్లీ

Tik Tok Video App : ఆ ఒక్క యాప్ చాలు... కుర్రాళ్లు చెడిపోవడానికీ, సమాజం, సంస్కృతి నాశనం అవ్వడానికి అంటూ తమిళనాడు మంత్రులు భగ్గుమన్నారు. ఫలితంగా సోషల్ మీడియాలో నయా ట్రెండ్ సృష్టించిన యాప్ తమిళనాడులో రద్దవుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: February 13, 2019, 10:19 AM IST
అదో బూతు పురాణం... టిక్ టాక్ యాప్‌ని నిషేధిస్తున్న తమిళనాడు అసెంబ్లీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Tik Tok App ఈ మధ్య ఎక్కువగా వాడుతున్న యాప్. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కి తోడు, వీడియోలు కూడా తేడాగానే ఉంటాయి. కానీ ఇది యూత్‌ని బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఈ యాప్‌తో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోందనీ, కుర్రాళ్లతోపాటూ... పెద్దవాళ్లు కూడా గంటల తరబడి దీన్ని ఆపరేట్ చేస్తూ... బూతు పురాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారని తమిళనాడులో వివాదం చెలరేగింది. ఇలాంటి యాప్‌ని రద్దు చేయడమే మంచిదని ప్రభుత్వ పెద్దలు కూడా భావించారు. ఇది సమాజాన్నీ, తమిళనాడు కల్చర్‌నీ దెబ్బతీస్తోందనే అభిప్రాయానికి వచ్చారు. దాంతో తమిళనాడు అసెంబ్లీ ఈ యాప్‌ని నిషేధించాలని కేంద్రాన్ని కోరబోతోంది.

చైనాకి చెందిన టిక్ టాక్ యాప్‌లో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తోపాటూ... కొన్ని వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే డైలాగ్స్ కూడా ఉన్నాయని తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు యాప్ వాడకంపై అభ్యంతరం చెప్పారు. యాప్‌ని వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మణికంఠన్ తెలిపారు.


జనరల్‌గా ఇలాంటి యాప్స్‌ని గూగుల్ స్వయంగా తొలగిస్తుంది. గూగుల్ ప్రమాణాలకు తగినట్లుగా యాప్ ఉందని భావిస్తేనే దాన్ని అమోదిస్తుంది. ఐతే... కొన్ని యాప్స్ పైకి చెప్పేదొకటి, చేసేది మరొకటి. టిక్ టాక్ కూడా అలాంటిదేనన్న భావన వస్తోంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే... టిక్ టాక్‌కి ఇండియాలో రెడ్ సిగ్నల్ పడినట్లే.

 

Video: ఆడుకుంటుండగా కరెంట్ షాక్ తగిలి ఆరేళ్ల బాలుడు మృతి
First published: February 13, 2019, 10:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading