Term Insurance తీసుకుంటున్నారా? వీటిలో రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీ గురించి ఈ వివరాలు తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాలంటే చాలా తక్కువ మొత్తంలో బీమా ప్రీమియంలు చెల్లిస్తే సరిపోతుంది. టీఆర్ఓపీ ప్లాన్ లో మాత్రం చాలా ఎక్కువగా బీమా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది.

  • Share this:
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత కోసం బీమా తీసుకోవడం తప్పనిసరి అయింది. ప్రస్తుతం వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్థిక నిపుణులూ సలహా ఇస్తున్నారు. అయితే సాధారణ టర్మ్ ప్లాన్‌లో పాలసీదారుడి ఆర్థిక అవసరాలను తీర్చలేని ఒక లోపం ఉంది. అదేంటంటే.. పాలసీదారుడు పాలసీ మెచూరిటీ పిరియడ్ కంటే ఎక్కువ కాలం జీవించి ఉన్నట్లయితే.. బీమా కంపెనీ ఎలాంటి డబ్బులు చెల్లించదు. పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నగదు కావాలనుకుంటే "టర్మ్ ఇన్సూరెన్స్ విత్ ఎ రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీ(TROP or Term Insurance with a Return of Premium)" తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాన్ తీసుకున్నప్పుడు పాలసీదారుడు చనిపోయినా లేదా బతికి ఉన్నా.. రెండు సందర్భాల్లోనూ ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు.

సాధారణ టర్మ్ పాలసీకి, టీఆర్ఓపీ (TROP) ప్లాన్ మధ్య తేడా ఏంటి..

ప్రీమియంలు

రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాలంటే చాలా తక్కువ మొత్తంలో బీమా ప్రీమియంలు చెల్లిస్తే సరిపోతుంది. టీఆర్ఓపీ ప్లాన్ లో మాత్రం చాలా ఎక్కువగా బీమా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రయోజనాలు

రెగ్యులర్ టర్మ్ ప్లాన్‌లో డెత్ బెనిఫిట్స్ మాత్రమే అందుతాయి. టీఆర్ఓపీ ప్లాన్‌లో మరణం, మెచూరిటీ ప్రయోజనాలను పొందవచ్చు. టీఆర్ఓపీ ప్లాన్‌ పాలసీ వ్యవధి ముగిశాక అన్ని ప్రీమియంలు మీకు తిరిగి చెల్లిస్తారు. అయితే మీరు చెల్లించిన ప్రీమియంలో కొంత భాగం వరకే తిరిగి చెల్లిస్తారనేది గమనించాలి. బేస్ పాలసీ, అదనపు అండర్ రైటింగ్ ప్రీమియంలు తిరిగి చెల్లిస్తే.. ప్రీమియం టాక్సెస్, రైడర్ ప్రీమియంలు తిరిగి చెల్లించరు.

పాలసీ వ్యవధిలో టీఆర్ఓపీ ప్లాన్‌ను నిలిపి వేయవచ్చు

మీరు పాలసీని ఆపివేయాలని/ సరెండర్ చేయాలని నిర్ణయించుకున్న వెంటనే, బీమా కంపెనీ ఒక సరెండర్ వాల్యూ లెక్కించి మీకు నగదు చెల్లిస్తుంది. కానీ మధ్యలోనే ప్లాన్ నిలిపివేయడం వల్ల డెత్ బెనిఫిట్స్ అందవు.

తదుపరి ప్రీమియంలు చెల్లించడం నిలిపివేసి.. పాలసీని తగ్గించిన చెల్లింపు పాలసీగా కూడా కొనసాగించవచ్చు. అయితే మీరు చెల్లించిన ప్రీమియం ఆధారంగా డెత్ బెనిఫిట్స్ ఉంటాయి. టర్మ్ కంటే ఎక్కువ కాలం జీవించిన సందర్భాల్లో.. కట్టిన ప్రీమియం తిరిగి పొందవచ్చు.

ఉత్తమ ప్లాన్ ఎందుకు కాదు?

కొందరికి టీఆర్ఓపీ ప్లాన్ ఒక మంచి ఆర్థిక భద్రత ఆప్షన్ గా కనిపించకపోవచ్చు. అందుకు కారణం టీఆర్ఓపీ ప్లాన్ లో రెగ్యులర్ పాలసీ కంటే రెండు, మూడు రెట్లు అధికంగా బీమా ప్రీమియం కట్టవలసి ఉంటుంది. ఎక్కువ బీమా ప్రీమియం చెల్లించే స్థోమత అందరికీ ఉండకపోవచ్చు. ఇంకో కారణం ఏంటంటే.. చెల్లించిన ప్రీమియం మొత్తంపై వడ్డీ రూపంలో ఎలాంటి రాబడి అందదు.
Published by:Krishna Adithya
First published: