Home /News /business /

TAKE HOME MARUTI SWIFT VXI BY PAYING JUST 83 THOUSAND WILL GET 23 KMPL MILEAGE WITH PREMIUM FEATURES MK

Maruti Swift: జస్ట్ రూ.83 వేలు చెల్లిస్తే చాలు సరికొత్త మారుతి స్విఫ్ట్ కారు మీ సొంతం...ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మారుతి స్విఫ్ట్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, దీని కోసం మీరు రూ. 5.85 లక్షల నుండి రూ. 8.67 లక్షల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే మీ వద్ద అంత పెద్ద బడ్జెట్ లేని సమయంలో, మీరు సులభంగా డౌన్‌పేమెంట్ ప్లాన్‌తో మంచి హ్యాచ్ బాక్ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఇంకా చదవండి ...
    Maruti Swift: కార్ల రంగంలోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ అనేది కస్టమర్లకు చాలా మంచి చాయిస్ అనే చెప్పాలి. ముఖ్యంగా బడ్జెట్ పరంగా  ఇది హ్యాచ్ బాక్ కార్లను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. అయితే ఇందులో కొన్ని కార్లు వాటి డిజైన్ ప్రీమియం ఫీచర్ల కోసం ఎక్కువగా కస్టమర్లు ఇష్టపడతారు. ఈ రోజు మనం మారుతి స్విఫ్ట్ గురించి మాట్లాడుదాం. 2021 సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే కావడం విశేషం . మీరు ఈ మారుతి స్విఫ్ట్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, దీని కోసం మీరు రూ. 5.85 లక్షల నుండి రూ. 8.67 లక్షల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే మీ వద్ద అంత పెద్ద బడ్జెట్ లేని సమయంలో, మీరు సులభంగా డౌన్‌పేమెంట్ ప్లాన్‌తో మంచి హ్యాచ్ బాక్ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.  తక్కువ డౌన్ పేమెంట్ , ఆన్ లైన్ EMI కాలిక్యులేటర్ ప్రకారం, మీరు మారుతి స్విఫ్ట్ VXI AMT వేరియంట్‌ను కొనుగోలు చేయాలని మీరు ప్లాన్ చేస్తే బ్యాంక్ దానిపై రూ. 6.05 లక్షల రుణాన్ని ఇస్తుంది. ఈ లోన్‌పై, మీరు కనిష్టంగా రూ. 83,472 డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు మీరు కారును సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి నెలా రూ. 15,898 నెలవారీ EMI చెల్లించాలి. మారుతీ స్విఫ్ట్‌పై రుణ కాలపరిమితి 60 నెలలు చెల్లించాలనేది. గుర్తించాలి. ఈ లోన్ మొత్తంపై బ్యాంకుకు  సంవత్సరానికి 9.8 శాతం చొప్పున వడ్డీని వసూలు చేస్తుంది.

    Silver ETF: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి సిల్వర్ ఈటీఎఫ్‌ లాంచ్.. దేశంలోని మొదటి సిల్వర్ ఈటీఎఫ్‌గా రికార్డు..


    మారుతి స్విఫ్ట్ రు ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం...

    >> మారుతి స్విఫ్ట్‌లో, కంపెనీ 1197 cc 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని అందించింది, ఇది 90 PS పవర్, 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ పొందవచ్చు.

    >> కారు ఫీచర్ల గురించి మాట్లాడుతూ, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందవచ్చు.

    Jio Cashback: ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై క్యాష్‌బ్యాక్ ఇస్తున్న జియో

    >> ఇది కాకుండా, క్రూయిజ్ కంట్రోల్, 4.2-అంగుళాల కలర్ డ్రైవర్ డిస్‌ప్లే, హై-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఆటో AC ESC, హిల్ హోల్డ్ కంట్రోల్, ABS, EBD, వెనుక పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు అందించబడ్డాయి. మైలేజీకి సంబంధించి,  మారుతి స్విఫ్ట్ కారు 23.20 kmpl మైలేజీని ఇస్తుందని మారుతి పేర్కొంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: MARUTI SUZUKI

    తదుపరి వార్తలు