హోమ్ /వార్తలు /బిజినెస్ /

CIBIL Score: మీ సిబిల్ స్కోర్ డ్రాప్ అయిందా..? ఇలా చేస్తే కచ్చితంగా పెరగడం ఖాయం

CIBIL Score: మీ సిబిల్ స్కోర్ డ్రాప్ అయిందా..? ఇలా చేస్తే కచ్చితంగా పెరగడం ఖాయం

సిబిల్ స్కోర్‌ను ఇలా కాపాడుకోండి

సిబిల్ స్కోర్‌ను ఇలా కాపాడుకోండి

సిబిల్‌ స్కోర్‌ అంటే వినియోగదారుల క్రెడిట్‌ స్కోర్‌(Credit Score) అని అర్థం. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పొందిన రుణాలు, తిరిగి చెల్లించిన వివరాల ఆధారంగా క్రెడిట్‌ స్కోర్‌ లెక్కిస్తారు. రుణాలు తిరిగి చెల్లించడంలో సమస్యలు ఉన్నా, గడువును మించి చెల్లించినా వాటి ప్రభా

ఇంకా చదవండి ...

ఒక వ్యక్తికి సంబంధించిన ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో సిబిల్‌ (CIBIL-Credit Information Bureau Limited) స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. రుణాలు(Loans), క్రెడిట్‌ కార్డుల (Credit Card) చెల్లింపు వ్యవహారాలపై సమాచారాన్ని సేకరించి సిబిల్ రిపోర్ట్స్‌ తయారు చేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతి నెలా రుణాలు తీసుకొన్న వారి వివరాలను సిబిల్‌కు అందజేస్తాయి. ఈ వివరాల ఆధారంగా ఆయా వ్యక్తులకు సంబంధించిన క్రెడిట్‌ స్కోర్‌ను సిబిల్‌ అందిస్తుంది. ఈ రోజుల్లో ఎలాంటి రుణాలు పొందాలన్నా సిబిల్‌ స్కోర్‌ కీలకం.

సిబిల్‌ స్కోర్‌ అంటే వినియోగదారుల క్రెడిట్‌ స్కోర్‌(Credit Score) అని అర్థం. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పొందిన రుణాలు, తిరిగి చెల్లించిన వివరాల ఆధారంగా క్రెడిట్‌ స్కోర్‌ లెక్కిస్తారు. రుణాలు తిరిగి చెల్లించడంలో సమస్యలు ఉన్నా, గడువును మించి చెల్లించినా వాటి ప్రభావం సిబిల్‌ స్కోర్‌పై కనిపిస్తుంది. సాధారణంగా సిబిల్‌ స్కోర్‌ 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ వక్తి ఆర్థిక వ్యవహారాలు అంత చక్కగా ఉన్నాయని భావిస్తారు. కొత్త రుణాలు పొందడం, క్రెడిట్‌ కార్డులు ఇవ్వడం వంటివి దీనిపైనే ఆధారపడి ఉంటాయి. 2000 సంవత్సరంలో ఏర్పాటైన సిబిల్‌ను అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రామాణికంగా తీసుకొంటున్నాయి. ప్రతి నెలా అవి అందించే వివరాలపైనే సిబిల్‌ స్కోర్‌ లెక్కిస్తారు కాబట్టి, సిబిల్‌పైన ఆధారపడి రుణాలు ఇస్తున్నాయి.


BSE మాజీ ఛైర్మన్ S రవి మాట్లాడుతూ..‘రుణాలు ఇవ్వడం పూర్తిగా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. లోన్ లేదా క్రెడిట్ కార్డ్ వంటివి జారీ చేసేందుకు బ్యాంకులు తరచుగా 300-900 స్కేల్‌పై 650 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ను సాధారణంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆమోదయోగ్యమైనవిగా పరిగణిస్తాయి’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో సిబిల్‌ స్కోర్‌ను మెరుగు పరచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏవో తెలుసుకుందాం.

అప్పులు తీర్చడం

సిబిల్‌ స్కోర్‌ను మెరుగుపరచడానికి అప్పులు లేదా EMIలను సకాలంలో చెల్లించడం మేలు. క్లీన్ రికార్డ్ చక్కగా కనిపించడమే కాకుండా సిబిల్‌ స్కోర్‌ను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అప్పులు ఎంత కాలం చెల్లించకుండా ఉంటే, సిబిల్‌పై అంత ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై దృష్టి పెట్టాలి, ఆదాయ పరిమితులలో ఉండాలి.

బ్యాలెన్స్‌డ్‌ మిక్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ అవసరం

సెక్యూర్డ్‌, అన్‌ సెక్యూర్డ్‌ క్రెడిట్‌ రెండింటినీ సక్రమంగా నిర్వహిస్తేనే క్రెడిట్‌ స్కోర్‌ మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. స్కోర్ తగ్గిందని క్రెడిట్ కార్డ్‌లను రద్దు చేయడం వల్ల ఫలితం ఉండదని చెబుతున్నారు. చాలా మంది వ్యక్తులు క్రెడిట్‌ కార్డులను రద్దు చేస్తే సిబిల్‌ స్కోర్‌ బాగా పెరుగుతుందని నమ్ముతారని, కానీ అది విరుద్ధంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.

క్రెడిట్ వినియోగ నిష్పత్తి (Credit utilization ratio)

సిబిల్‌స్కోర్‌ను ప్రభావితం చేసే మరో ముఖ్యమైన అంశం క్రెడిట్ వినియోగ నిష్పత్తి. ఆరోగ్యకరమైన క్రెడిట్ వినియోగ నిష్పత్తిని నిర్వహించడం చాలా కీలకం. జరిమానాలను నివారించడానికి మొత్తంలో 30 శాతాన్ని ఉపయోగించాలి. క్రెడిట్ ఇవ్వడానికి ఒకరి క్రెడిట్ వినియోగ నిష్పత్తి సరిపోదు. బకాయిలను సకాలంలో చెల్లించేటప్పుడు దానిని తెలివిగా ఉపయోగించాలి. స్కోర్‌ను మెరుగుపరచడంలో ఈ అంశాల్లో ప్రతి ఒక్కటి కీలకమని నిపుణులు చెబుతున్నారు.

Published by:Mahesh
First published:

Tags: Cibil score, Credit score, Personal Loan, Repayment

ఉత్తమ కథలు