Swiggy Jobs: స్విగ్గీలో భారీ ఉద్యోగాలు.... 18 నెల్లలో 3 లక్షల నియామకాలు

రానున్న 10-15 ఏళ్లలో సంవత్సరాల్లో వంద మిలియన్ల మంది కస్టమర్లు ప్రతి నెల 15 రెట్లు తమ ఫ్టాల్ ఫామ్ పై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మెజెటీ తెలిపారు.

news18-telugu
Updated: October 20, 2019, 8:45 AM IST
Swiggy Jobs: స్విగ్గీలో భారీ ఉద్యోగాలు.... 18 నెల్లలో 3 లక్షల నియామకాలు
Swiggy: సెక్స్ కావాలని మహిళకు డెలివరీ బాయ్ వేధింపులు... కంప్లైంట్ చేస్తే రూ.200 కూపన్ పంపిన స్విగ్గీ
news18-telugu
Updated: October 20, 2019, 8:45 AM IST
Swiggy Jobs: స్విగ్గీలో భారీ ఉద్యోగాలు.... 3 లక్షల నియామకాలు

ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ స్విగ్గీ భారీ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్దం చేస్తుంది. తన ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులకు సేవల్ని అందచేయడంతో పాటు... ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని సంస్థ భావిస్తోంది. నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రానున్న 18 నెలల్లో 3 లక్షలమందిని నియమించుకోవాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. స్విగ్గి కి రోజు రోజుకి వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే డెలివరీ చేస్తుండటంతొ వినియోగదారులను ఆకర్షిస్తుంది స్విగ్గి. అయితే ఇప్పుడు స్విగ్గి నిరుద్యోగులకు ఉద్యోగాలను కూడా కల్పిస్తుంది . దీంతో తన ఉద్యోగుల సంఖ్యను 5లక్షలకు పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే... దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థగా స్విగ్గీ అవతరిస్తుంది.

గిగాబైట్స్ అనే వార్షిక టెక్ కాన్ఫరెన్స్‌లో స్విగ్గీ సహా వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మెజెటీ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ వృద్ధి అంచనాలు కొనసాగితే...ఆర్మీ, రైల్వేల తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద ఉపాధి వనరుగా మారడానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టదని ాయన అన్నారు. రానున్న 10-15 ఏళ్లలో సంవత్సరాల్లో వంద మిలియన్ల మంది కస్టమర్లు ప్రతి నెల 15 రెట్లు తమ ఫ్టాల్ ఫామ్ పై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మెజెటీ తెలిపారు. చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించేలా స్విగ్గీ అవకాశం కల్పిస్తుంది . స్విగ్గి డెలివరీ పార్ట్ నర్ గా పనిచేసే ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో సంపాదిస్తుండటంతో ఎక్కువమంది ఈ ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.



First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...