Swiggy Stores: ఇంట్లోకి కావాల్సిన సరుకులు స్విగ్గీలో ఆర్డర్ చేయొచ్చు

Swiggy Stores | మీరు ఏం ఆర్డర్ చేసినా ఓ గంటలోపు ఇంటికి సరుకులు వచ్చేస్తాయి. ఇందుకోసం హెల్త్ కార్ట్, జ్యాప్‌ఫ్రెష్, అపోలో ఫార్మసీతో ఒప్పందం కుదుర్చుకుంది స్విగ్గీ.

news18-telugu
Updated: February 13, 2019, 9:54 AM IST
Swiggy Stores: ఇంట్లోకి కావాల్సిన సరుకులు స్విగ్గీలో ఆర్డర్ చేయొచ్చు
Swiggy Stores: ఇంట్లోకి కావాల్సిన సరుకులు స్విగ్గీలో ఆర్డర్ చేయొచ్చు
  • Share this:
మధ్యాహ్నం ఆఫీసుకి లంచ్ తీసుకెళ్లలేదంటే స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చులే అన్న ధీమా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో సరుకులు అయిపోయినా స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఎందుకంటే స్విగ్గీ స్టోర్స్ పేరుతో కొత్త సర్వీస్ లాంఛైంది. ఇంట్లోకి కావాల్సిన సరుకులు, మెడిసిన్, పువ్వులు, మాంసం ఇలా ఏం కావాలన్నా స్విగ్గీలో ఆర్డర్ చేస్తే చాలు ఇంటికి వచ్చేస్తాయి. టూత్ పేస్ట్ నుంచి బియ్యం బస్తా వరకు ఏం కావాలన్నా ఆర్డర్ చేయొచ్చు.

Read this: LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

ప్రస్తుతం స్విగ్గీ స్టోర్స్ సేవలు గురుగ్రామ్‌లో ప్రారంభమయ్యాయి. ఏకంగా 3,500 స్టోర్స్‌ నుంచి స్విగ్గీ డెలివరీ చేస్తోంది. మీరు ఏం ఆర్డర్ చేసినా ఓ గంటలోపు ఇంటికి సరుకులు వచ్చేస్తాయి. ఇందుకోసం హెల్త్ కార్ట్, జ్యాప్‌ఫ్రెష్, అపోలో ఫార్మసీతో ఒప్పందం కుదుర్చుకుంది స్విగ్గీ. అయితే కస్టమర్ నుంచి ఎంత ఫీజు వసూలు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. త్వరలో ఈ సేవలు మిగతా నగరాలకూ విస్తరించే అవకాశముంది. ఇటీవలే నాస్పర్స్ నుంచి 1 బిలియన్ డాలర్ల ఫండింగ్ పొందిన స్విగ్గీ... తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది.

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు



ఇవి కూడా చదవండి:

TRAI rules: ఛానెళ్లు సెలెక్ట్ చేసుకున్నారా? మీ కేబుల్ బిల్ ఇలా మారుతుందికామర్స్‌లో పీజీ... జొమాటోలో డెలివరీ బాయ్... నిరుద్యోగ సమస్యకు సాక్ష్యం

Valentine's Day: ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
First published: February 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>