Swiggy-Uber Deal: ఊబెర్ ఈట్స్‌ని కొనేందుకు స్విగ్గీ చర్చలు

Swiggy-Uber Deal | ఊబెర్ ఈట్స్ ఇండియాను స్వీగ్గీ సొంతం చేసుకుంటే ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండటం ఖాయం. ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు తుది దశకు వచ్చాయని తెలుస్తోంది.

news18-telugu
Updated: February 22, 2019, 3:56 PM IST
Swiggy-Uber Deal: ఊబెర్ ఈట్స్‌ని కొనేందుకు స్విగ్గీ చర్చలు
Swiggy-Uber Deal: ఊబెర్ ఈట్స్‌ని కొనేందుకు స్విగ్గీ చర్చలు
  • Share this:
రైడింగ్ సేవలు అందించే ఊబెర్... ఊబెర్ ఈట్స్ పేరుతో ఫుడ్ డెలివరీ సర్వీసులు కూడా అందిస్తోంది. ఇప్పుడు ఊబెర్ ఈట్స్ ఇండియాను స్విగ్గీ కొనేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే స్విగ్గీ అతిపెద్ద ఫుడ్-టెక్ కంపెనీగా ఎదగడం ఖాయం. ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు తుది దశకు వచ్చాయని తెలుస్తోంది. ఈ డీల్ పూర్తైతే స్విగ్గీలో ఊబెర్‌కు 10 శాతం వాటా లభిస్తుంది. ఆ వాటా విలువ 3.3 బిలియన్ డాలర్లు.

ఇండియన్ ఫుడ్-టెక్ కంపెనీ అయిన స్విగ్గీ ఇటీవలే 1 బిలియన్ డాలర్ల ఫండింగ్ పొందడం విశేషం. జొమాటో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది స్విగ్గీ. గతేడాది అక్టోబర్‌లో జొమాటో ఆలీబాబా అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్షియల్ నుంచి 210 మిలియన్ డాలర్ల నిధుల్ని సేకరించింది. జొమాటో, స్విగ్గీల మధ్య ఫుడ్ టెక్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉంది. మరో పోటీ కంపెనీ అయిన ఊబెర్ ఈట్స్ ఇండియాను స్వీగ్గీ సొంతం చేసుకుంటే ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండటం ఖాయం. మరోవైపు ఊబెర్ నష్టాలను తగ్గించుకునే వ్యూహంలో ఊబెర్ ఈట్స్ ఇండియాను అమ్మనుందని తెలుస్తోంది.

Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


ఇవి కూడా చదవండి:

WhatsApp Bug: మీ వాట్సప్‌లో బగ్ ఉందా? మీ ప్రైవసీకి ముప్పేనా?

PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండిPersonal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్
First published: February 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading