రైతులు, చిరువ్యాపారులతో అమెరికా యాత్ర...స్వదేశీ జాగరణ్ మంచ్ వినూత్న ప్రయోగం...

వారం రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఈ ప్రతినిధి బృందం అమెరికాలోని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు ఇన్వెస్టర్లు, బ్యాంకులను సందర్శించనుంది. తమ వినూత్న ఆలోచనలను రైతులు, చిరు వ్యాపారస్తులు వారితో పంచుకోనున్నారని స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ పేర్కొన్నారు.

news18-telugu
Updated: September 11, 2019, 7:05 PM IST
రైతులు, చిరువ్యాపారులతో అమెరికా యాత్ర...స్వదేశీ జాగరణ్ మంచ్ వినూత్న ప్రయోగం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
చిరువ్యాపారులు, రైతులు పెట్టుబడుల కోసం ఇంతకాలం బ్యాంకులు, ప్రైవేటు లెండర్స్ ను ఆశ్రయించేవారు. కానీ బడా వ్యాపారులు, కార్పోరేట్ కంపెనీలు మాత్రం తమ పెట్టుబడుల కోసం విదేశీ సంస్థలు, బ్యాంకులను ఆశ్రయిస్తుంటాయి. విదేశాల్లో స్టార్టప్ కల్చర్ ఊపందుకు్న నేపథ్యంలో వినూత్నమైన ఆలోచనలతో కూడిన బిజినెస్ మోడల్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా మనదేశంలో చిరు వ్యాపారుల్లో సైతం వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి. వారికి పెట్టుబడి కొరవడటంతో అవన్నీ కార్యరూపంలో దాల్చడంలేదు. అయితే మనదేశంలోని సృజనాత్మకతతో కూడిన ఆలోచనలకు విదేశాల్లోని స్టార్టప్ కల్చర్ కు మధ్య వారధి నిర్మించేందుకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రయత్నం చేస్తోంది.

ఇందులో భాగంగా మన దేశానికి చెందిన రైతులు, చిరువ్యాపారులతో కూడిన డెలిగేషన్ ను అమెరికాలో పర్యటించేందుకు సెప్టెంబర్ 21వ తేదీన పంపనుంది.  వారం రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఈ ప్రతినిధి బృందం అమెరికాలోని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు ఇన్వెస్టర్లు, బ్యాంకులను సందర్శించనుంది. తమ వినూత్న ఆలోచనలను రైతులు, చిరు వ్యాపారస్తులు వారితో పంచుకోనున్నారని స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ పేర్కొన్నారు. ఈ బృందం అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్ లో ప్రధానంగా పర్యటించనుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఒక డెలిగేషన్ గత జూలై మాసంలో సింగపూర్ లో పర్యటించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పేరిట 35 మందితో కూడిన ప్రతినిధి బృందం సింగపూర్ లో పర్యటించింది. అంతే కాదు వరల్డ్ హిందు ఎకనామిక్ ఫోరం పేరిట అంతర్జాతీయ సదస్సును సెప్టెంబర్ 27-29 తేదీల్లో అమెరికాలో నిర్వహించనున్నట్లు సీయట్ ప్రతినిధి ప్రవీణ్ ఖండేల్ వాల్ పేర్కొన్నారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>