సుజుకి(Suzuki) మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ నుంచి సరికొత్త స్కూటర్ లాంచ్(Scooter Launch) అయింది. ఇటీవల విడుదల చేసిన అవెనిస్ (Avenis) 125సీసీ స్కూటర్‌కు స్టాండర్డ్ ఎడిషన్‌ను కంపెనీ(Company) పరిచయం చేసింది. సుజుకి కంపెనీ ఇంతకుముందు అవెనిస్ స్కూటర్ రైడ్ కనెక్ట్ ఎడిషన్, రేస్ ఎడిషన్‌లను(Edition) విడుదల చేసింది. అనంతరం వీటికి డిమాండ్(Demand) పెరిగింది. దీంతో పెరిగిన కస్టమర్ల(Costumers) అంచనాలకు అనుగుణంగా కొత్త వేరియంట్లను తీసుకురావాలని కంపెనీ భావించింది. ఈ క్రమంలో అవెనిస్ స్కూటర్ ఆప్షన్లలో కొత్త వేరియంట్‌ను రిలీజ్ చేసింది.
కొత్త వేరియంట్ ఉత్పత్తిలో భాగంగా కంపెనీ రైడర్‌ల కన్వీనియెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంది. స్టాండర్డ్ ఎడిషన్‌లో ఎక్స్‌టర్నల్ హింజ్ టైప్ ఫ్యూయెల్ క్యాప్, సీటు కింద ఎక్కువ ఖాళీ ఉండేలా డిజైన్, ఇతర ఫీచర్లను కొనసాగించింది. లేటెస్ట్ స్పోర్టీ స్టైలింగ్, మోటార్‌సైకిల్ ఇన్‌స్పైర్డ్ రియర్ ఇండికేటర్స్, బాడీ మౌంట్ బ్రైట్ LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్‌తో ఈ వేరియంట్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. స్కూటర్ మొత్తం స్టైల్ కోటీన్‌ను సుజుకి కంపెనీ స్టాండర్డ్ ఎడిషన్‌లో అలాగే కొనసాగించింది.
ఈ స్కూటర్‌ను లాంచ్ చేసిన సందర్భంగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. Ltd. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సతోషి ఉచిదా మాట్లాడారు. ఇండియన్ మార్కెట్లో అవెనిస్ స్కూటర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను ఊహించామన్నారు. ‘మా కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విశ్వసనీయమైన ఇంజన్, అడ్వాన్స్‌డ్ స్పోర్టీ డిజైన్‌తో వచ్చిన ప్రొడక్ట్ మార్కెట్‌లో సూపర్ సక్సెస్ అయింది. అవెనిస్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా హౌస్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రొడక్ట్స్‌లో అవెనిస్ ఒకటిగా మారింది. Gen Z కస్టమర్లే లక్ష్యంగా అవెనిస్ స్టాండర్డ్ ఎడిషన్‌ను డిజైన్ చేశాం’ అని చెప్పారు.
సుజుకి అవెనిస్ స్కూటర్ 6750rpm వద్ద 8.7ps పవర్‌ను, 5500rpm వద్ద 10Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. FI టెక్నాలజీతో కూడిన 125cc ఇంజిన్, 106 కిలోల లైట్ వెయిట్ బాడీతో ఇది కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఫ్యూయల్ నింపే సమయంలో సౌలభ్యం కోసం కొత్త ఎక్స్‌టర్నల్ హింజ్ టైప్ ఫ్యూయల్ క్యాప్‌ను కూడా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా(Suzuki Motor Cycle India) ఈ వేరియంట్‌లో (Variant) పరిచయం చేసింది. సుజుకి అవెనిస్ సీటు కాస్త పెద్దదిగా ఉంటుంది. దీని కింద హెవీ స్పేస్ అందించారు. USB సాకెట్‌తో కూడిన ఫ్రంట్ బాక్స్ వంటి ఫీచర్లతో అవెనిస్ స్కూటర్ స్టాండర్ట్ ఎడిషన్ లాంచ్ అయింది.
* కొత్త వేరియంట్ ధర
సుజుకి 125సీసీ అవెనిస్ స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.86,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధర అవెనిస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ కంటే రూ.1,500 ఎక్కువ కాగా, రేస్ ఎడిషన్ కంటే రూ.1,800 తక్కువ. ఈ రెండు ఎడిషన్‌లలో అందించిన బ్లూటూత్ కనెక్టివిటీని కొత్త వేరియంట్‌లో తీసివేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Motor Cycle, Suzuki, Two wheelers