సుజుకి నుంచి కొత్త యాక్సిస్ 125 సీసీ వేరియంట్ విడుదల...

మార్కెట్లోకి సరికొత్త యాక్సిస్‌ 125 సిసి వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అలయ్ వీల్స్‌ ఆప్షన్స్‌తో వస్తున్న ఈ టూవీలర్ ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధరను రూ. 59,891గా నిర్ణయించారు.

news18-telugu
Updated: August 13, 2019, 9:18 AM IST
సుజుకి నుంచి కొత్త యాక్సిస్ 125 సీసీ వేరియంట్ విడుదల...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో దూసుకెళ్తున్న సుజుకీ మోటార్స్‌ సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దేశ మార్కెట్లోకి సరికొత్త యాక్సిస్‌ 125 సిసి వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అలయ్ వీల్స్‌ ఆప్షన్స్‌తో వస్తున్న ఈ టూవీలర్ ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధరను రూ. 59,891గా నిర్ణయించారు. అయితే ఈ మోడల్ లో ముందు చక్రానికి డిస్క్‌బ్రేక్‌ ఏర్పాటు చేసిన టూవీలర్ వేరియంట్‌ ధరను రూ.61,788గా నిర్ధారించారు. ప్రస్తుతం మార్కెట్లో అలాయ్ వీల్స్‌ ఆప్షన్‌కు డిమాండ్‌ పెరగడంతో దీన్ని డ్రమ్‌ బ్రేక్‌ అలాయ్ వీల్స్‌తో అందుబాటులోకి తెచ్చింది. అయితే బైక్స్ తో పాటు ప్రస్తుతం ఈ తరహా ఆటోమేటిక్ మోపెడ్స్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే మార్కెట్లో కొత్త వేరియంట్స్‌ ను విడుదల చేయనున్నట్లు సుజుకి ఇండియా ప్రతినిధులు తెలిపారు.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు