Home /News /business /

SUPPLEMENT YOUR CORPORATE HEALTH PLAN WITH PERSONAL INSURANCE POLICY IS IT MANDATORY KNOW DETAILS GH VB

Health Insurance: కార్పొరేట్ గ్రూప్‌ హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉందా.. దాంతో పాటు మరో ఇన్సురెన్సు కూడా అవసరమా..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

దాదాపు అన్ని ప్రముఖ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్పొరేట్స్‌ స్పాన్సర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ (Group Health Insurance)ను తీసుకుంటుంటారు. ఆ తర్వాత ప్రత్యేకంగా వ్యక్తిగత ఆరోగ్య బీమా (Personal Health Insurance)ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదనే భావన వీరిలో ఏర్పడుతుంది.

ఇంకా చదవండి ...
దాదాపు అన్ని ప్రముఖ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు(Employees) కార్పొరేట్స్‌ స్పాన్సర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ (Group Health Insurance)ను తీసుకుంటుంటారు. ఆ తర్వాత ప్రత్యేకంగా వ్యక్తిగత ఆరోగ్య బీమా (Personal Health Insurance)ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదనే భావన వీరిలో ఏర్పడుతుంది. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నట్లయితే రిస్క్ చేస్తున్నట్టే లెక్క! ఎందుకంటే కార్పొరేట్ ఇన్సూరెన్స్‌లు చాలా తక్కువ హామీ మొత్తాన్ని ఆఫర్ చేస్తాయి. ఈ అస్యూర్డ్‌ మనీ (Assured Money) వైద్య ఖర్చులకు ఏ మాత్రం సరిపోకపోవచ్చు. అందుకే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌(Group Health Insurance) ఉన్నా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను(Personal Health Insurance) తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా మరిన్ని విలువైన విషయాలను వారు పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ మొత్తాలకు మాత్రమే హామీ ఇచ్చే కార్పొరేట్ కవర్లు
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో దాదాపు అన్నీ రూ. 2-4 లక్షల హామీ మొత్తాన్ని (SA) మాత్రమే ఆఫర్ చేస్తాయి. హాస్పిటలైజేషన్ ఖర్చులు కొంతకాలంగా పెరుగుతున్నాయి, కాబట్టి గ్రూప్ ప్లాన్‌లలోని హామీ మొత్తం కొన్ని సమయాల్లో ఏ మూలకు సరిపోకపోవచ్చు. ఈ రోజుల్లో దీర్ఘకాల వ్యాధుల చికిత్సకు రూ.20-30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కోవిడ్-19 కోసం కూడా, పెద్ద సంఖ్యలో ప్రజలు రూ. 10 లక్షలకు పైగా ఆసుపత్రి బిల్లులను చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకం బాగా సహాయపడుతుంది.

HDFC Interest Rates: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు..


వెయిటింగ్ పీరియడ్
వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్లాన్‌కు ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వరకు నిరీక్షణ వ్యవధి (Waiting Period) ఉంటుంది. ఈ వ్యవధిలో పేర్కొన్న మినహాయింపులు, ముందుగా ఉన్న అనారోగ్యాలు కవరేజీ అందదు. మీరు ఒక వ్యక్తిగత ప్లాన్‌ను కొనుగోలు చేసినట్లయితే.. దాని వెయిటింగ్ పీరియడ్ పూర్తయ్యేలోపు మీ యజమాని అందించిన బీమా ద్వారా కవరేజ్ పొందవచ్చు. లేదా యాక్టివ్ కవరేజ్ అందించే ఏదైనా బీమా పాలసీని తీసుకోవాలి.

నో-క్లెయిమ్ బోనస్‌ని సేకరించాలి
వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకాలు (Personal Health Insurance Plans) 10-50 శాతం వరకు నో క్లెయిమ్ బోనస్‌ను అందిస్తాయి. మీ హామీ మొత్తాన్ని చాలా తక్కువ ఖర్చుతో పెంచుకోవడానికి నో-క్లెయిమ్ బోనస్ బెస్ట్‌గా నిలుస్తుంది. మీకు గ్రూప్ పాలసీలో కవరేజీ ఉంటుంది కాబట్టి ఏవైనా చిన్న వైద్య ఖర్చులకోసం స్మాల్ క్లెయిమ్‌లను అక్కడ ఫైల్ చేయవచ్చు. తద్వారా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకంలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయకుండా నో క్లెయిమ్ బోనస్‌ను సొంతం చేసుకోవచ్చు.

జారీ కాని పాలసీలు
మీరు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు తేలినా లేదా గతంలో పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా.. కొన్ని బీమా సంస్థలు పర్సనల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను జారీ చేయవు. కొన్ని సందర్భాలలో బీమా సంస్థ అలాంటి షరతులను శాశ్వతంగా మినహాయించవచ్చు లేదా పాలసీని జారీ చేసేందుకు తిరస్కరించవచ్చు. ఇలాంటి రిజెక్షన్లు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. మధుమేహం, వెన్నెముక సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇన్సూరెన్స్ పాలసీను జారీ చేయడంలో కొన్ని బీమా కంపెనీలు ఆసక్తి కనబరచడం లేదు. క్లెయిమ్‌లతో సంబంధం లేకుండా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు కవరేజ్ అందిస్తుంది కాబట్టి దీనిని ముందుగా తీసుకోవడం మంచిది.

Reserve Bank Of India: రుణాలిచ్చి ప్రజలను వేధిస్తున్న కంపెనీలపై ఆర్‌బీఐ కొరడా.. 5 NBFCల రిజిస్ట్రేషన్‌ రద్దు..


గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో పరిమితులు
కొన్ని కంపెనీలు ఖర్చులను మేనేజ్ చేయడానికి ఉద్యోగుల గ్రూప్ ప్లాన్‌లో పరిమితులను విధించి ఉండవచ్చు. ఇలాంటి వాటి వల్ల ఉద్యోగి తన సొంత జేబులో నుంచి క్లెయిమ్‌లో కొంత భాగాన్ని చెల్లించవలసి ఉంటుంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా చూసుకుంటే, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.
Published by:Veera Babu
First published:

Tags: Financial Planning, Health Insurance, Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు