హోమ్ /వార్తలు /బిజినెస్ /

Sunny Leone: సన్నీ లియోన్ కొత్త బిజినెస్... సంపాదన పెంచుకోవడానికి నయా ఐడియా

Sunny Leone: సన్నీ లియోన్ కొత్త బిజినెస్... సంపాదన పెంచుకోవడానికి నయా ఐడియా

Sunny Leone: సన్నీ లియోన్ కొత్త బిజినెస్... సంపాదన పెంచుకోవడానికి నయా ఐడియా
(Image: Instagram)

Sunny Leone: సన్నీ లియోన్ కొత్త బిజినెస్... సంపాదన పెంచుకోవడానికి నయా ఐడియా (Image: Instagram)

Sunny Leone | బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్లాట్‌ఫామ్‌లో తన పేరు కూడా వినిపించేలాచేసింది.

బాలీవుడ్​ నటి, శృంగార తార సన్నీలియోన్​ (Sunny Leone) అంటే తెలియని వారుండరు. తన అంద చందాలతో కుర్రకారును ఉర్రూతలూగించే సన్నీ ఇప్పుడు ఓ కొత్త బిజినెస్​లోకి అడుగుపెట్టింది. ఆమె తాజాగా నాన్​ ఫంజిబుల్​ టోకెన్​ (NFT) మార్కెట్​లోకి ప్రవేశించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఫీమేల్​ ఇండియన్​ సెలబ్రిటీగా రికార్డు సృష్టించింది. ఈ మధ్యే బాలీవుడ్​ మెగాస్టార్​ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ ఎన్​ఎఫ్​టీ మార్కెట్​లోకి అడుగుపెట్టారు. ఆయన తర్వాత రజనీకాంత్, సల్మాన్ ఖాన్, మలయాళ నటుడు రిమా కల్లింగల్ వంటి సెలబ్రెటీలు ఎన్​ఎఫ్​టీ మార్కెట్​ ద్వారా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి లాగే తన డిజిటల్​ ఆస్తుల్ని వెనకేసుకునే పనిలో పడింది సన్నీలియోన్​. ఇందు కోసం సిలికాన్​ వ్యాలీకి చెందిన పాపులర్​ ఎన్​ఎఫ్​టీ ప్లాట్​ఫామ్​ మింట్​డ్రోఫ్జ్​తో చేతులు కలిపింది. ఈ ప్లాట్​ఫామ్​ ద్వారానే తన ఆర్ట్​ వర్క్​కు చెందిన ఎన్​ఎఫ్​టీ కలెక్షన్లను (ethereum blockchain​) వేలం వేయనుంది.

ప్రస్తుతం సన్నీలియోన్​ "మిస్​ఫిట్జ్​" పేరుతో 9,600 NFTలను కలిగి ఉంది. ఎన్​ఎఫ్​టీలోకి ప్రవేశించిన విషయాన్ని సన్నీ లియోన్​ ట్విట్టర్​ వేదికగా షేర్​ చేసింది. ‘‘మిస్​ ఫిజ్​ను కలవండి! ఇది మిస్​ ఫిజ్​ హనీ! ఆమెకు గులాబి రంగంటే చాలా ఇష్టం. టాటూలు వేయించుకున్న కుర్రాళ్లన్నా ఇష్టమే. మిస్​ ఫిట్జ్​ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా దేని కోసం ఆలోచిస్తున్నారు? సన్నీలియోన్​ ఎన్​ఎఫ్​టీలు సిద్దంగా ఉన్నాయి. వెంటనే కొనుగోలు చేయండి.” అంటూ మిస్​ ఫిట్జ్​ ఫోటోను జోడించి ట్వీట్​ చేసింది.


ఎన్ఎఫ్​టీలోకి అడుగుపెట్టిన తొలి ఫీమేల్ సెలబ్రెటీగా రికార్డు


ఎన్​ఎఫ్​టీ అంటే నాన్​ ఫంజిబుల్​ టోకెన్​. ఇవి క్రిప్టోకరెన్సీల వలే డిజిటల్​ ఆస్తుల కిందికి వస్తాయి. సెలబ్రెటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, వీడియోలను డిజిటల్​ ఫార్మాట్​లోకి మార్చి బ్లాక్​ చెయిన్​ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్మారు. క్రిప్టోకరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్​ వర్క్​ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రెటీలకు సంబంధించిన ఎన్​ఎఫ్​టీలపై పూర్తి హక్కులు వాటిని కొనుగోలు చేసిన వారికే ఉంటాయి. ఎన్​ఎఫ్​టీలను కొన్న వారు వాటిని తిరిగి వేలం వేసి అధిక మొత్తంలో సంపాదించవచ్చు. ఇలా వేలం జరిగినప్పుడల్లా వేలం అమౌంట్​​లో 10 శాతం ఎన్​ఎఫ్​టీ క్రియేటర్​కు వాటా దక్కుతుంది.

కరోనా తర్వాత NFT మార్కెట్​ వేగంగా విస్తరిస్తోంది. బాలీవుడ్​ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల బాలీ కాయిన్​ పేరుతో ఎన్​ఎఫ్​టీ మార్కెట్​లోకి ప్రవేశించారు. ఇక, బిగ్​బీ అమితాబ్ బచ్చన్ ఎన్​ఎఫ్​టీ వేలం వేయగా.. మొదటి రోజున $5,20,000 (సుమారు రూ. 3.8 కోట్లు) విలువైన అమ్మకాలు జరిగాయి.

First published:

Tags: Amitabh bachchan, Bitcoin, Cryptocurrency, Rajinikanth, Salman khan, Sunny Leone

ఉత్తమ కథలు