Money | ఇంట్లో డబ్బులు బ్యాంక్‌లో దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే బ్యాంక్‌లో (Bank) కాకుండా వేరే చోట డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ పొందొచ్చు. ఎలా? ఎక్కడ? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫైనాన్స్ కంపెనీలు బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. సుందరం హోమ్ ఫైనాన్స్ తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు (FD) పెంచేసింది. దీంతో కస్టమర్లు డబ్బులు దాచుకోవాలని భావిస్తే.. వారికి సుందరం హోమ్ ఫైనాన్స్‌లో గతంలో కన్నా ఇకపై అధిక రాబడి వస్తుందని చెప్పుకోవచ్చు.
సుందరం ఫైనాన్స్ తాజాగా రూ. 2 కోట్లకు లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. ప్రస్తుతం ఈ ఫైనాన్స్ కంపెనీ రెగ్యులర్ కస్టమర్లకు ఎఫ్‌డీలపై 7.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 8 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి వడ్డీ రేట్ల పెంపు అమలులోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంటోంది.
ఈ ఎలక్ట్రిక్ కారుతో రూ.14 లక్షలు ఆదా.. ఒక్కసారి చార్జ్ చేస్తే 240 కి.మి వెళ్లొచ్చు!
ఏడాది టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.2 శాతంగా ఉంది. రెండేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. మూడేళ్ల ఎఫ్‌డీలపై కూడా దాదాపు ఇదే వడ్డీ రేటు ఉంది. నాలుగేళ్లు, ఐదేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. సీనియర్ సిటిజన్స్‌కు సుందరం ఫైనాన్స్ 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ అందిస్తోంది. రెండేళ్ల టెన్యూర్‌పై ఏకంగా 8 శాతం వడ్డీ పొందొచ్చు. కాగా బజాజ్ ఫైనాన్స్ కూడా ఇటీవలనే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది.
ఈ కారుకు భలే డిమాండ్.. కొనాలంటే సంవత్సరం ఆగాల్సిందే!
కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును పెంచుకుంటూ రావడంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుకుంటూ వస్తున్నాయి. దీంతో బ్యాంకులు వరుసపెట్టి ఎఫ్‌డీ రేట్లను పెంచేశాయి. ఎస్‌బీఐ దగ్గరి నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ వరకు చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచేశాయి. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగుతోంది. అలాగే వచ్చే నెలలో కూడా ఆర్‌బీఐ రెపో రేటును పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఎఫ్‌డీ రేట్లు మరింత పైకి కదులుతాయని చెప్పుకోవచ్చు. బ్యాంకులు అలాగే రుణ రేట్లు కూడా పెంచేశాయి. దీని వల్ల బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Money