కార్పొరేట్ చరిత్రలో భారీ పవర్ డీల్... 1600 మెగావాట్లు కొంటున్న గూగుల్

Google Renewable Energy : గూగుల్ కొత్త అగ్రిమెంట్స్ వల్ల పునరుత్పాదక శక్తి ఉత్పత్తి కోసం రూ.14239 కోట్లు ఖర్చుపెట్టి... మౌలిక వసతులు డెవలప్ చెయ్యాల్సి ఉంది. ఇందులో భాగంగా... లక్షల కొద్దీ సోలార్ ప్యానెళ్లూ, విండ్ టర్బైన్లనూ... మూడు ఖండాల్లో ఏర్పాటు చేయనున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 21, 2019, 1:05 PM IST
కార్పొరేట్ చరిత్రలో భారీ పవర్ డీల్... 1600 మెగావాట్లు కొంటున్న గూగుల్
కార్పొరేట్ చరిత్రలో భారీ పవర్ డీల్... 1600 మెగావాట్లు కొంటున్న గూగుల్
  • Share this:
కార్పొరేట్ కంపెనీల చరిత్రలో తొలిసారిగా... 1600 మెగావాట్ల పునరుత్పాదక శక్తి (Renewable Energy)ని కొనబోతున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇందుకోసం ఆల్రెడీ ఉన్న పవర్ డీల్స్‌తోపాటూ... అదనంగా మరో 18 ఎనర్జీ డీల్స్ కుదుర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ డీల్స్ వల్ల... ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సోలార్, విండ్ పవర్ సంస్థలు తమ సామర్ధ్యాన్ని 40 శాతం అధికంగా పెంచనున్నాయి. తద్వారా 5,500 మెగావాట్లు ఉత్పత్తి చెయ్యనున్నాయి. ఇది 10 లక్షల సోలార్ రూఫ్ టాప్స్‌తో సమానం. ఈ ప్రాజెక్టులన్నీ అమల్లోకి వస్తే... వాషింగ్టన్ డీసీ లేదా లిథువేనియా లేదా ఉరుగ్వే లాంటి దేశాలు ఏడాది మొత్తం ఉత్పత్తి చేసే కరెంటు కంటే ఎక్కువే పునరుత్పాదక శక్తి ఉత్పత్తి అవుతుందని సుందర్ పిచాయ్ తెలిపారు.

వందల మంది గూగుల్ ఉద్యోగులు గ్లోబల్ క్లైమేట్ స్ట్రైక్‌లో పాల్గొనేందుకు సిద్ధమైన తరుణంలో.... సుందర్ పిచాయ్ ఈ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు జరగనుంది. 2017, 2018లో గూగుల్... తనకు అవసరమైన కరెంటు మొత్తాన్నీ... రిన్యూవబుల్ ఎనర్జీ (సోలార్, విండ్, సీ ఎనర్జీ) ద్వారానే పొందింది. తద్వారా కరెంటు విషయంలో కాలుష్యరహితమైన కంపెనీగా నిలిచింది. ఇప్పుడు తాజా ఒప్పందాలతో గూగుల్ కంపెనీలో రిన్యూవబుల్ ఎనర్జీ సామర్ధ్యం మరో 40 శాతం పెరగనుంది.

గూగుల్ కొత్త అగ్రిమెంట్స్ కారణంగా... పునరుత్పాదక శక్తి ఉత్పత్తి కోసం రూ.14239 కోట్లు ఖర్చుపెట్టి... మౌలిక వసతులు (energy infrastructure) డెవలప్ చెయ్యాల్సి ఉంది. ఇందులో భాగంగా... లక్షల కొద్దీ సోలార్ ప్యానెళ్లూ, విండ్ టర్బైన్లనూ... మూడు ఖండాల్లో ఏర్పాటు చేయనున్నారు.

తాజా డీల్స్‌తో కలిపి గూగుల్ మొత్తం 52 ఎనర్జీ ప్రాజెక్టులతో డీల్స్ కుదుర్చుకున్నట్లు అవుతుంది. వాటి మొత్తం ఖరీదు దాదాపు రూ.50వేల కోట్లు. ఫలితంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Published by: Krishna Kumar N
First published: September 21, 2019, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading