Alert : సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే ఏప్రిల్ 1కి ముందే ఇలా చేయండి..

మీరు సుకున్య సమృద్ధి యోజన ఖాతాలో ఇన్వెస్ట్ చేశారా అయితే..కొత్త ఆర్థికసంవత్సరంలోకి అడుగుపెడుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఖాతా క్లోజ్ అయ్యే అవకాశముంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: March 23, 2019, 1:05 PM IST
Alert : సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే ఏప్రిల్ 1కి ముందే ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 23, 2019, 1:05 PM IST
సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులు ఏప్రిల్ 1కి ముందే అలెర్ట్ అవ్వండి.. సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఎన్‌పీఎస్ ఇలా ఏ స్కీమ్ అయిన సరే.. ఏప్రిల్ 1కి ముందే నగదుని చెల్లించాలి. లేకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది. అయితే, ఏయే ఖాతాలో ఎంత చెల్లించాలి. ఒకవేళ చెల్లించలేకపోతే అకౌంట్ క్లోజ్ అయితే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ : మీ కూతురి కోసం ఈ ఖాతాలో పొదుపు చేస్తుంటే.. ఇందులో మినీమం రూ.250 చెల్లించాలి. అది మార్చి 31లోగా చెల్లించాలి. అప్పుడే మీ ఖాతాను కొనసాగించొచ్చు. ఒకవేళ 31లోగా చెల్లించకపోతే రూ50 అదనంగా చెల్లించాలి. ఇలా చేస్తే మీ ఖాతా మళ్లీ పున: ప్రారంభం జరుగుతుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) : సుకన్య సమృద్ధి యోజన పథకంలాగే పీపీఎఫ్ అకౌంట్ కూడా. ఇందులో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అంటే మార్చి 31లోగా రూ. 500 డిపాజిట్ చేయాలి. లేకపోతే మీ అకౌంట్ డీఆక్టివేట్ అవుతుంది. ఒకవేళ్ల అలానే అయితే పెనాల్టీ కింద మరో రూ.50 అదనంగా చెల్లించాలి.rupee

నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్) : ఈ స్కీమ్‌లో భాగాంగా మార్చి 31లోగా రూ. 1000 చెల్లించాలి. లేకపోత అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ చెల్లించకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుంది. అలాకాకుండా ఉండాలంటే నిర్ణీతగడువులోగా చెల్లించాలి. కౌంట్ క్లోజ్ అయినట్లైతే రూ. 100 అదనంగా చెల్లిస్తే.. అకౌంట్ రీ ఓపెన్ అవుతుంది.

క్లోజ్ అయిన ఖాతా తెరవాలంటే :  నిర్ణీత గడువు అంటే మార్చి 31లోగా ఖాతాదారులందరూ నగదు చెల్లించకపోవడం కారణంగా అకౌంట్స్ క్లోజ్ అయితే.. అప్పుడు మనం ఏ బ్యాంకులో, పోస్ట్‌ ఆఫీస్‌లో ఖాతా తెరిచామో అక్కడికి వెళ్లిఖాతాదారులు అప్లికేషన్ తీసుకోవాలి. అది ఫిల్ చేసి పెనాల్టీ కింద స్కీమ్‌లో ఉన్నట్లుగా డబ్బు డిపాజిట్ చేయాలి. అప్పుడు ఖాతా తిరిగి యాక్టివ్ అవుతుంది.



 
First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...