Sukanya samriddhi yojana, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. రెండింటిలో బెటర్ ఆప్షన్ ఏది...

Sukanya samriddhi yojana, మ్యూచువల్ ఫండ్స్ అనేవి రెండు విభిన్న పెట్టుబడి మార్గాలు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మూలధన వస్తువు కాగా.. Sukanya samriddhi yojana ఫిక్సెడ్ ఇన్ కమ్(స్థిర ఆదాయ) వనరు. మ్యూచువల్ ఫండ్స్ ద్రవ్య సాధనాలు (లిక్విడ్ ఇన్ స్ట్రూమెంట్స్).

news18-telugu
Updated: November 10, 2020, 11:32 AM IST
Sukanya samriddhi yojana, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. రెండింటిలో బెటర్ ఆప్షన్ ఏది...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
నా పేరు నీషు(పేరు మార్చం). నా కూతురు భవిష్యత్తు కోసం ఏవైన ఫైనాన్షియల్ ప్లాన్స్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నా. తనకు ఇప్పుడు ఆరేళ్లు. 20 ఏళ్లు వచ్చే లోపు 50 నుంచి 60 లక్షల రూపాయల అందుకునేలా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారు. చాలా మంది Sukanya samriddhi yojana పథకం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెబుతున్నారు. అయితే ఆ స్కీములు గురించి అర్థం కావట్లేదు అయోమయంగా ఉంది. రాజీ పడకుండా నా లక్ష్యాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నా. కాబట్టి ఎలాంటి ఛాన్స్ తీసుకోలేను. కావున ఏ పథకంలో పెట్టుబడి పడితే మంచి రిటర్నులు వస్తాయి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలనో దయ చేసి సలహా ఇవ్వండి.

Sukanya samriddhi yojana, మ్యూచువల్ ఫండ్స్ అనేవి రెండు విభిన్న పెట్టుబడి మార్గాలు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మూలధన వస్తువు కాగా.. Sukanya samriddhi yojana ఫిక్సెడ్ ఇన్ కమ్(స్థిర ఆదాయ) వనరు. మ్యూచువల్ ఫండ్స్ ద్రవ్య సాధనాలు (లిక్విడ్ ఇన్ స్ట్రూమెంట్స్). Sukanya samriddhi yojana అనేది మీ కుమార్తేకు 21 ఏళ్లు వచ్చే వరకు పెట్టిన డబ్బులు అనేవి తీయడానికి వీలుండదు. అంటే మీ ఫండ్ లాక్ అయి ఉంటుంది.

కచ్చితంగా మీ కూతురుకు 20 ఏళ్లు పూర్తయే లోపు డబ్బు కావాలంటే ఈ పథకంతో మీ లక్ష్యం సాధ్యపడదు. కాబట్టి మీరు రెండు వేరు వేరు పోర్ట్ ఫోలియోలను ఎంచుకుంటే మంచిది. అంటే రెండు పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి. రూ.50-60 లక్షల ఆదాయాన్ని సృష్టించాలంటే రాబోయే 14 ఏళ్ల పాటు ఎస్ఐపీల్లో నెలకు రూ.12,000 చొప్పున పెట్టుబడి పెట్టాలి. అంటే Sukanya samriddhi yojanaలో నెలకు రూ.3,000 చొప్పున పెట్టుబడి పెట్టాలి. మిగిలిన రూ.9,000లను మిరే అసెట్ లార్జ్ క్యాపిటల్ ఫండ్ , డీఎస్బీ క్యాప్ ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్స్ లో సమాన నిష్పత్తిలో నెలవారీగా పెట్టుబడి పెడితే అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయవచ్చు.

కాలపరిమితి ఎక్కువగా ఉన్న కారణంగా ఈక్విటీల్లో ఎక్కువ మొత్తం పెట్టుబడి పెడితే మంచిది. ఎందుకంటే దీర్ఘకాలిక పెట్టుబడి పథకమైన ఈక్విటీల్లో అస్థిరత చాలా వరకు తగ్గుతుంది. అప్పుడే మీరనుకున్న ఆదాయాన్ని సృష్టించుకోగలుగుతారు.
Published by: Krishna Adithya
First published: November 10, 2020, 11:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading