SBI | మీరు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరాలని భావిస్తున్నారా? అయితే పాప వయసు పదేళ్లు దాటిపోయిందా. అందువల్ల పథకంలో (Scheme) చేరలేకపోయారా? అయితే మీకు శుభవార్త అందే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్‌బీఐ (SBI) రీసెర్చ్ కీలక సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి స్కీమ్‌ను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. ఇందులో భాగంగానే కొత్త రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించడానికి కీలక ప్రతిపాదన చేసింది.
కేంద్ర ప్రభుత్వం తన ద్రవ్యలోటు ఫైనాన్సింగ్ కోసం ఎక్కువగా స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పైన ఆధారపడుతోందని ఎస్‌బీఐ రీసెర్చ్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి కేంద్రం రూ. 5 లక్షల కోట్లు పొందే అవకాశం ఉందని వివరించింది. ఈ క్రమంలోనే సుకన్య సమృద్ధి స్కీమ్ కొత్త రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని 12 ఏళ్ల వరకు వయసు కలిగిన వారికి అందుబాటులో ఉంచాలని సిఫార్సు చేసింది.
స్టైలిష్ లుక్‌తో వావ్ అనిపిస్తున్న ఎలక్ట్రిక్ బైక్ .. ఒక్కసారి చార్జ్ చేస్తే 250 కి.మి. వెళ్లొచ్చు!
సుకన్య సమృద్ధి స్కీమ్ డిపాజిట్ల విషయంలో బ్యాంకులు చాలా తక్కువ వాటాను కలిగి ఉన్నాయని, పోస్టాఫీస్‌లు అధిక వాటా కలిగి ఉన్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్ తెలిపింది. అందువల్ల బ్యాంకులు కూడా బిజినెస్ కరస్పాండెట్ల ద్వారా సుకన్య సమృద్ధి స్కీమ్ రిజిస్ట్రేషన్లను చేపట్టవచ్చని తెలిపింది. దీని వల్ల బ్యాంకులు సుకన్య సమృద్ధి స్కీమ్ డిపాజిట్ల వాటా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
రూ.45 వేలకే అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ .. బడ్జెట్ తక్కువ, ఫీచర్లు ఎక్కువ!
సుకన్య సమృద్ధి స్కీమ్ రూల్స్ ప్రకారం చూస్తే.. పదేళ్ల వరకు వయసు కలిగిన ఆడ పిల్లల పేరుపై మాత్రమే సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. అందువల్ల 12 ఏళ్ల వరకు వయసు కలిగిన వారికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తే బాగుంటుందని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంటోంది. ఏజ్ లిమిట్ కారణంగా స్కీమ్ నుంచి దూరమైన వారు మళ్లీ పథకంలో చేరేందుకు అవకాశం లభిస్తుందని తెలిపింది.
ఎస్‌బీఐ రీసెర్చ్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే.. సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. పదేళ్ల వయసు దాటిన పిల్లల పేరుపై కూడా సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏజ్ లిమిట్ పెంచి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పిస్తుందా? లేదా? అనే అంశాన్ని తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, Personal Finance, Sbi, Small saving, State bank of india, Sukanya samriddhi yojana