news18-telugu
Updated: July 1, 2020, 4:44 PM IST
Savings Scheme: రూ.66 లక్షలు రిటర్న్ ఇచ్చే ఈ స్కీమ్ గురించి తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)
సుకన్య సమృద్ధి యోజన.... చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పాపులర్ స్కీమ్. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందే తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం ఇది. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అమ్మాయిల చదువు నుంచి పెళ్లి వరకు భవిష్యత్ అవసరాల కోసం ఇప్పట్నుంచే పొదుపు చేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. తక్కువ మొత్తంతో పొదుపు ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అందించడం ఈ పథకం ప్రత్యేకత. ఈ పథకంలో ప్రతీ ఏటా ఇన్వెస్ట్ చేస్తే రూ.66 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
Jio offer: జియో యూజర్లకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్... ప్లాన్స్ ఇవేసుకన్య సమృద్ధి యోజన పథకంలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా చేరొచ్చు. ఇద్దరు కూతుళ్లకు కూడా ఈ అకౌంట్ తీసుకోవచ్చు. అమ్మాయి వయస్సు 10 ఏళ్ల లోపు ఉన్నప్పుడే ఈ స్కీమ్‌లో చేరాలి. 15 ఏళ్లు పొదుపు చేయాలి. 21 ఏళ్ల తర్వాత డబ్బులు వెనక్కి వస్తాయి. అంటే అమ్మాయికి 3 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ స్కీమ్‌లో చేరితే 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేయాలి. 24 ఏళ్లకు స్కీమ్ డబ్బులు వెనక్కి వస్తాయి. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి లేదా ఉన్నత చదువుల కోసం అప్పటి వరకు జమైన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.
SBI Home Loan: గుడ్ న్యూస్... హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన ఎస్బీఐ
దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల్లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో నెలకు కనీసం రూ.250 నుంచి జమ చేయొచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ.1,50,000 వరకు పొదుపు చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ పొదుపు చేసే అవకాశం లేదు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతీ నెల తప్పనిసరిగా పొదుపు చేయాలి. ఒక నెల చెల్లించకపోతే మరుసటి నెలలో ఆ మొత్తాన్ని ఆలస్య రుసుముతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించినప్పుడు 9.1 శాతం వడ్డీ ఉండేది. ప్రస్తుతం 7.60 శాతం వడ్డీ ఇస్తోంది ప్రభుత్వం. ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఈ వడ్డీ రేటు ఎక్కువే. ప్రతీ మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సవరిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
New Rules: ఏటీఎం నుంచి పీఎఫ్ వరకు... నేటి నుంచి మారే రూల్స్ ఇవే
ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ ఉంది కాబట్టి ఈ లెక్కను మీరు ప్రతీ ఏడాది రూ.1,50,000 చొప్పున 15 ఏళ్లు పొదుపు చేస్తే 21 ఏళ్ల తర్వాత రూ.66 లక్షల రిటర్న్స్ వస్తాయి. వడ్డీ రేట్లు మారితే ఈ రిటర్న్స్ కూడా మారతాయి. ఇందులో డిపాజిట్ చేసే డబ్బులపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.
First published:
July 1, 2020, 4:44 PM IST