Small Saving Schemes | పెద్ద పెద్ద సముద్రాలు కూడా చిన్న చిన్న నీటి చుక్కలతోనే ఏర్పాడతాయి. అనే విషయం మనకు తెలుసు. పాదయాత్రలు కూడా ఒక్క అడుగు తోనే ప్రారంభం అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటన్నారా? సేవింగ్స్‌కు (Money) కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ (Investment) చేయాల్సిన పని లేదు. మీ ఆదాయం తక్కువగా ఉందా? అయితే చిన్న మొత్తంతోనే ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించొచ్చు. చిన్న మొత్తంలో అయినా సరే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందొచ్చు.
ఇప్పుడు మనం నెలకు రూ. 500 పొదుపుతో మెచ్యూరిటీ సయమంలో రూ. 2.5 లక్షలు ఎలా పొందొచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. పదేళ్ల లోపు వయసు కలిగిన ఆడ పిల్లలు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. కేవలం రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఒక్క రూపాయి కట్టక్కర్లేదు.. రూ.10 లక్షల లిమిట్‌తో ఉచితంగా క్రెడిట్ కార్డు పొందండిలా!
మీరు నెలకు రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పటి నుంచి రూ. 500 పెడితే మెచ్యూరిటీలో రూ. లక్షలు పొందొచ్చు. సుకన్య సమృద్ధి పథకంలో చేరిన వారు 15 ఏళ్ల వరకు డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు త్రైమాసికం చొప్పున మారుతూ ఉండొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. కేంద్రం వడ్డీ రేటును సమీక్షిస్తుంది.
రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు పొందొచ్చు.. మీ డబ్బును రెట్టింపు చేసే ఎస్‌బీఐ స్కీమ్!
మీరు నెలకు రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే.. ఏడాదికి రూ. 6 వేలు డిపాజిట్ చేసినట్లు అవుతుంది. అంటే 15 ఏళ్లలో చూస్తే.. మీరు రూ. 90 వేల వరకు ఇన్వెస్ట్ చేసిన వారు అవుతారు. 15 నుంచి 21 ఏళ్ల వరకు మీరు డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. అయితే వడ్డీ మాత్రం వస్తూ ఉంటుంది. అంటే అప్పుడు మీకు వడ్డీ రూపంలో రూ. 1,64,606 వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 90 వేలు. ఈ రెండింటినీ కలిపితే రూ. 2.54 లక్షలు అవుతాయి. అంటే మీకు మెచ్యూరిటీలో రూ. 2.5 లక్షలకు పైగా వస్తాయని చెప్పుకోవచ్చు. అందువల్ల మీకు పాప ఉంటే.. సుకన్య స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించడండి. అలాగే ఈ స్కీమ్‌లో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Money, Personal Finance, Post office scheme, Saving money, Sukanya samriddhi yojana