హోమ్ /వార్తలు /బిజినెస్ /

Sukanya Samriddhi Yojana: మీ అమ్మాయికి ఆర్థిక భద్రతనిచ్చే సుకన్య స‌మృద్ధి యోజ‌న.. అర్హత, వడ్డీరేట్ల వివరాలివే..!

Sukanya Samriddhi Yojana: మీ అమ్మాయికి ఆర్థిక భద్రతనిచ్చే సుకన్య స‌మృద్ధి యోజ‌న.. అర్హత, వడ్డీరేట్ల వివరాలివే..!

Small Savings Schemes: 
(ప్రతీకాత్మక చిత్రం)

Small Savings Schemes: (ప్రతీకాత్మక చిత్రం)

సుకన్య సమృద్ధి యోజన అనే చిన్న పొదుపు పథకం ద్వారా ఆడ పిల్లల తల్లిదండ్రులు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పొదుపు పథకం గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం, రండి..

సుకన్య సమృద్ధి యోజన అనే చిన్న పొదుపు పథకం ద్వారా ఆడ పిల్లల తల్లిదండ్రులు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పొదుపు పథకం గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం, రండి..

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకు కి బదిలీ చేయవచ్చు. అవసరాన్ని బట్టి పోస్ట్ ఆఫీస్ కి కూడా మార్చుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని చిన్న పొదుపు పథకాల్లో కెల్లా సుకన్య సమృద్ధి యోజన పథకం ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీ డబ్బుల భద్రత గురించి కంగారు పడాల్సిన అవసరం ఉండదు.

సుకన్య సమృద్ధి యోజన అర్హతలు:

ఆడబిడ్డ జన్మించిన క్షణం నుంచి 10ఏళ్ల వయసు వచ్చేలోపు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద అకౌంట్ తెరవచ్చు. ఆడపిల్లకు 10 ఏళ్ళు దాటితే అకౌంట్ తెరవడానికి సాధ్యపడదు. ఆడపిల్లకు 18 సంవత్సరాల వయసు వస్తే.. ఖాతా ఆమె ఆధీనంలోకి వస్తుంది. అప్పటివరకు తల్లిదండ్రులకు మాత్రమే అకౌంట్ పై అధికారం ఉంటుంది.

సుక‌న్య స‌మృద్ధి ఖాతా ఇన్వెస్ట్‌మెంట్‌ పీరియడ్ 15 సంవత్సరాలు కాగా.. మీరు ఖాతా తెరిచిన సమయం నుంచి 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్‌ చేయొచ్చు. సుకన్య సమృద్ధి ఖాతా మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవ‌త్స‌రాలు. అనగా ఖాతా తెరిచిన సమయం నుంచి 21 సంవత్సరాల వరకు ఈ పథకం పనిచేస్తుంది. అయితే ఒక కుటుంబం కేవలం 2 ఖాతాలు మాత్రమే తెరవగలదు. ఒకవేళ ఇద్దరు లేదా ముగ్గురు కవలలు ఉన్నట్లయితే.. 3 ఖాతాలు తెరవచ్చు. మొదటి డెలివరీలో కవలలు(ఇద్దరు ఆడపిల్లలు).. రెండవ డెలివరీలో మరొక ఆడపిల్ల జన్మిస్తే.. ఆ ముగ్గురు పిల్లల కోసం 3 ఖాతాలు తెరవవచ్చు. ఐతే ఒక్క ఆడబిడ్డకు కేవలం ఒకటే ఖాతా తెరవాల్సి ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన డిపాజిట్ నిబంధనలు:

1. ఏ ప్రభుత్వ బ్యాంకులోనైనా లేదా పోస్ట్ ఆఫీసులోనైనా కనీసం రూ.250 డిపాజిట్ చేసి సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవవచ్చు.

2. ప్రతీ సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఖాతాలో రూ.250 డిపాజిట్ చేయని యెడల రూ.50 పెనాల్టీ పడుతుంది. అంతేకాదు, అకౌంట్ డిఫాల్ట్ అకౌంట్ గా మారుతుంది. అప్పుడు పెనాల్టీతో పాటు రూ.250 డిపాజిట్ చేస్తే.. నార్మల్ అకౌంట్ గా మారుతుంది. ఒకవేళ మీరు ఖాతా తెరిచిన తర్వాత 3 సంవత్సరాలు వరకూ ఒక్క పైసా కూడా డిపాజిట్ చేయలేదు అనుకోండి. అప్పుడు మీరు రూ.150 పెనాల్టీతో పాటు ఒక్కో ఏడాదికి 250 చొప్పున 3 సంవత్సరాలకు రూ.750 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

3. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో సంవత్సరానికి గరిష్టంగా 1.50 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పరిమితి దాటి.. ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు మీకు వెంటనే వెనక్కు వచ్చేస్తాయి.

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు & పన్ను ప్రయోజనాలు:

సెప్టెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికం ప్రకారం సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులు 7.6 శాతం వడ్డీ రేటు పొందేందుకు అర్హులు. సంపాదించిన వడ్డీ ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతాకు జమ అవుతుంది. ఈ పథకం ఖాతాలపై ప్ర‌తీ త్రైమాసికానికి వడ్డీరేట్లు మారుతుంటాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను నుంచి మినహాయింపు పొందటానికి ఖాతాదారులు అర్హులు.


ఖాతా క్లోజింగ్ & విత్ డ్రాయల్:

సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచిన 5 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేయొచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు వచ్చినా.. లేదా పదో తరగతి పూర్తిచేసినా.. ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయొచ్చు.

First published:

Tags: Sukanya samriddhi yojana

ఉత్తమ కథలు