తగ్గిన ఉత్పత్తి...చక్కర ధరలు పెరుగుతాయా?

ఈ ఏడాది నవంబరు 15 వరకు ఉత్పత్తి అయిన చక్కర...గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 2 లక్షల టన్నుల మేర తగ్గింది.

news18-telugu
Updated: November 19, 2018, 3:34 PM IST
తగ్గిన ఉత్పత్తి...చక్కర ధరలు పెరుగుతాయా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో చక్కర ఉత్పత్తి తగ్గింది. అయితే ఇది చక్కర ధరలపై ప్రభావం చూపుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. చక్కర మిల్స్ వద్ద అదనపు నిల్వలు ఎక్కువగా ఉండడంతో ధరలు ఇప్పటికిప్పుడు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది నంబరు 15 వరకు దేశంలో 11.63 లక్షల టన్నుల చక్కరను ఉత్పత్తి చేశారు. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 13.73 లక్షల టన్నుల చక్కరను ఉత్పత్తి చేసినట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోషియేషన్ వెల్లడించింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 2 లక్షల టన్నుల మేర ఉత్పత్తి తగ్గింది. అయితే ఇప్పటికే దేశంలోని చక్కర మిల్లులు అవసరానికి మించి ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రస్తుతం చక్కర మిల్లుల్లోని అదనపు నిల్వలను విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. 2019 మొదట్లో చైనాకు భారీగా చక్కర ఎగుమతి చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి కాంట్రాక్టు కింద 50 వేల టన్నుల ముడి చక్కరను చైనాకు ఎగుమతి చేయనున్నారు. దాదాపు రెండు మిల్లియన్ టన్నుల మేర ముడి చక్కరను భారత్ నుంచి చైనాకు ఎగుమతి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇండోనేషియా, మలేషియాకు కూడా చక్కరను ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. బాస్మమతి యేతర బియ్యంతో పాటు ముడి చక్కరను చైనా ఎక్కువగా భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.
Published by: Janardhan V
First published: November 19, 2018, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading