Success Story : సాఫ్ట్‌వేర్ కొలువు మానేశాడు.. కోళ్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదిస్తున్నాడు..

Success Story : సాఫ్ట్‌వేర్ కొలువు అనగానే అంతా ఎగబడే ఈరోజుల్లో.. ఆ ఉద్యోగాన్ని వదిలి రిస్క్‌తో కూడిన నాటుకోళ్ల వ్యాపారం చేయడం అంత ఆషామాషీ ఏమి కాదు. కానీ శివసాయి చరణ్ ధైర్యంతో.. నమ్మకంతో ముందడుగేసి సక్సెస్ అయ్యాడు. ఆయన సక్సెస్ స్టోరీ ఇప్పుడు పలువురికి ఆదర్శంగా మారిందనే చెప్పాలి.

news18-telugu
Updated: March 6, 2019, 11:40 AM IST
Success Story : సాఫ్ట్‌వేర్ కొలువు మానేశాడు.. కోళ్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదిస్తున్నాడు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 6, 2019, 11:40 AM IST
ఉద్యోగం చేయడమా..? లేక సొంతంగా వ్యాపారం చేసుకోవడమా..? చదువైపోయాక ప్రతీ యువకుడి మదిలోనూ మెదిలే ప్రశ్న ఇది. అభిలాష, ఆర్థిక నేపథ్యం, ఎంచుకునే రంగాన్ని బట్టి చాలామంది తమ కెరీర్‌ ప్లాన్ చేసుకుంటారు. కొంతమందికి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని ఉన్నా.. పరిస్థితుల కారణంగా అయిష్టంగానే ఉద్యోగంలో చేరుతారు. కానీ బిజినెస్ ఆలోచన మాత్రం ఓవైపు వెంటాడుతూనే ఉంటుంది. ఉద్యోగమా.. సొంత వ్యాపారమా.. అన్న ఆ సంఘర్షణలో నుంచి ఏదైతే అది అని కొంతమంది ముందడుగు వేస్తారు.. అలా అడుగువేసినవాడే ఈడిగ శివసాయి చరణ్..

కర్నూలు జిల్లాకు చెందిన శివసాయి చరణ్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక బెంగళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం పొందాడు. అయితే ఎన్నాళ్లు ఉద్యోగం చేసినా.. పెద్దగా ఎదుగూ బొదుగూ ఉండదన్న భావన అతన్ని వెంటాడుతుండేది. సొంతంగా వ్యాపారం చేస్తే జీవితంలో త్వరగా పైకి ఎదగవచ్చునని భావించాడు. అందుకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా సమర్పించేసి.. సొంత ఊరిలో దిగిపోయాడు.

గ్రామానికి వచ్చాక ఏ బిజినెస్ మొదలుపెట్టాలా? అని ఆలోచిస్తున్న తరుణంలో.. నాటుకోళ్ల వ్యాపారం గురించి అతని దృష్టికి వచ్చింది. దీంతో మార్కెట్‌లో నాటుకోళ్ల డిమాండ్.. దాని వ్యాపార విస్తృతి గురించి అధ్యయనం చేశాడు. లాభసాటిగా ఉంటుందని తెలియడంతో.. నాటుకోళ్ల వ్యాపారంలో దిగిపోయాడు. రూ.20లక్షల పెట్టుబడితో కోళ్ల ఫారాలు నిర్మించి నాటుకోళ్లను పెంచడం మొదలుపెట్టాడు.


మొదట రూ.4లక్షల పెట్టుబడితో 2వేల కోడిపిల్లలను కొని నాటుకోళ్ల పెంపకం మొదలుపెట్టాడు. నాలుగు నెలల తర్వాత ఒక్కో కోడి 2కిలోల బరువు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో నాటుకోడికి రూ.200 ధర పలుకుతోంది. దీంతో పెట్టుబడి పోగా.. శివసాయికి నెలకు రూ.2వేలు ఆదాయం సమకూరుతోంది. శివసాయి నాటుకోళ్ల వ్యాపారం సక్సెస్ కావడంతో.. అతనిపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వ్యాపారంలో ఇప్పుడిప్పుడే మెలుకువలు తెలుసుకుంటున్నానని, పూర్తి స్థాయి అవగాహనతో వ్యాపారం చేస్తే మరిన్ని లాభాలు వస్తాయని శివసాయి అంటున్నాడు.



సాఫ్ట్‌వేర్ కొలువు అనగానే అంతా ఎగబడే ఈరోజుల్లో.. ఆ ఉద్యోగాన్ని వదిలి రిస్క్‌తో కూడిన నాటుకోళ్ల వ్యాపారం చేయడం అంత ఆషామాషీ ఏమి కాదు. కానీ శివసాయి చరణ్ ధైర్యంతో.. నమ్మకంతో ముందడుగేసి సక్సెస్ అయ్యాడు. ఆయన సక్సెస్ స్టోరీ ఇప్పుడు పలువురికి ఆదర్శంగా మారిందనే చెప్పాలి.

First published: March 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...