LPG Gas : మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. షాక్‌లో ప్రజలు..

ఇప్పటికే అన్నీ ధరలు పెరిగి సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మరో పిడుగు పడింది. ఎల్పీజీ గ్యాస్ ధరను అమాంతం రూ.2.08 పెంచుతూ ఐవోసీ ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రజలపై అధికభారం పడనుంది.

Amala Ravula | news18-telugu
Updated: March 1, 2019, 12:45 PM IST
LPG Gas : మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. షాక్‌లో ప్రజలు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 1, 2019, 12:45 PM IST
నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతోనే అల్లాడుతున్న ప్రజలపై మరో పిడుగు పడింది. సబ్సిడీ గ్యాస్ ధరను రూ.2.08 పెంచుతున్నట్లు ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన చేసింది. దీంతో సబ్సీడీయేతర ఎల్పీజీ ఒక్కో సిలిండర ధర రూ.42.50 అధికం కానుంది.
ప్రతినెలా ఒకటో తారీఖున చమురు సంస్థలు ఎల్పీజీ ధరలను సవరిస్తూ ఉంటాయి. ఎల్పీజీ ధరలు, విదేశీ మారక ద్రవ్యంలో మార్పుల కారణంగా ధరలను సవరించినట్లు IOC పేర్కొంది.
పెరిగిన ధరలతో మార్చి 1వ తేదీ నుండి న్యూఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ రూ.495.61 ఉండగా.. సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ రూ.701.5గా ఉండనుంది. ఇప్పటికే ధరలు పెరుగుదలతో సామాన్యులు బతుకుబండిని ఈడుస్తుండగా.. తాజాగా ఎల్పీజీ గ్యాస్ పెంపు భారం ప్రజలపై పడింది.

First published: March 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...