హోమ్ /వార్తలు /బిజినెస్ /

Education Loan: ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి విద్యార్థులు.. ఎడ్యుకేషన్ లోన్స్ చెల్లింపులపై బ్యాంకుల స్పందన ఏంటి..?

Education Loan: ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి విద్యార్థులు.. ఎడ్యుకేషన్ లోన్స్ చెల్లింపులపై బ్యాంకుల స్పందన ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. చదువుకు ఆటంకం కలగడమే కాకుండా, విద్యా రుణాలు పొందిన వారు తమ గ్రాడ్యుయేషన్, ఉద్యోగ నియామకాలు ఆలస్యమైతే రుణాలు తిరిగి చెల్లించడంలో ఏర్పడిన జాప్యానికి జరిమానాల భా?

ఇంకా చదవండి ...

ఉక్రెయిన్‌లో యుద్ధం(Russia Ukraine War) కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులు(Students) ఆందోళన చెందుతున్నారు. చదువుకు ఆటంకం కలగడమే కాకుండా, విద్యా రుణాలు పొందిన వారు తమ గ్రాడ్యుయేషన్(Graduation), ఉద్యోగ నియామకాలు ఆలస్యమైతే రుణాలు తిరిగి చెల్లించడంలో ఏర్పడిన జాప్యానికి జరిమానాల భారాన్ని కూడా భరించాల్సి వస్తుందని ఆందోళనలో ఉన్నారు. దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India), బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda), యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా, ఇతర ఆర్థిక సంస్థలను మనీకంట్రోల్‌ సంస్థ సంప్రదించగా.. ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.

రుణదాతలు విద్యార్థులకు మారటోరియం ఇస్తారా?

ఈ పరిస్థితిపై నిపుణులు మాట్లాడుతూ..‘ ఈ సంక్షోభంలో విద్యారుణాల చెల్లింపుల ప్రభావాన్ని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. లోన్‌ను రీ స్ట్రక్చర్‌ చేయడం, తిరిగి చెల్లించాల్సిన సమయాన్ని పొడిగించడం, లాంగర్‌ లోన్‌ మారటోరియం కల్పించడం వంటి అవకాశాలను సందర్భానుసారం కల్పించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యా రుణాలు తీసుకొన్న విద్యార్థులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎటువంటి అధికారిక ఆర్థిక సాయాన్ని ఇప్పటివరకు పప్రకటించలేదు’ అని చెప్పారు. ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తీసుకొనే నిర్ణయాలు వాటి పరిస్థితిపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు రుణదాతలు ఎలా మద్దతు ఇస్తున్నారు?

ఉక్రెయిన్‌లో చదువుకోవడానికి విద్యా రుణాలు ఇచ్చిన అవన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ, సీఈవో అమిత్ గైండా మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులను సంప్రదిస్తాం. విద్యార్థులు స్థిరపడటానికి, ఉక్రెయిన్‌లో ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి బయటపడటానికి ససాయం చేస్తాం. రెగ్యులేటరీ మార్గదర్శకాల మేరకు రుణాలను రీ స్ట్రక్చర్‌ చేస్తాం. మార్గదర్శకత్వం అవసరమైన రుణగ్రహీతలకు అవాన్సే కౌన్సెలింగ్ సెషన్‌లను సిద్ధం చచేస్తున్నాం.’ అని చెప్పారు.

CBSE Term 2: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. మ్యాథ్స్‌లో మంచి మార్కులు సాధించండిలా..!

రుణ ఒప్పందాలలో యుద్ధం వల్ల విద్యకు అంతరాయం కలిగితే లోన్‌ రద్దయ్యే అవకాశం ఉందా?

జీవిత బీమా పాలసీల తరహాలో విద్యార్ధుల రుణ ఒప్పందాలలో యుద్ధం కారణంగా లోన్‌ తిరిగి చెల్లించడాన్ని రద్దు చేసే అవకాశం లేదు. అసాధారణ సంక్షోభ సమయాల్లో బ్యాంకులు రుణగ్రహీతలతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంటాయని కొందరు సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

విద్యారుణాలు తిరిగి చెల్లించలేకపోతే ఎలాంటి చర్యలు తీసుకొంటారు?

బ్యాంక్‌ బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి మాట్లాడుతూ..‘ రుణాలు తిరిగి చెల్లించలేకపోయినా, జాప్యం నెలకొన్నా రుణగ్రహీతల క్రెడిట్‌ స్కోర్‌ తీవ్రంగా దెబ్బ తింటుంది. వడ్డీ ఎక్కువగా పెరుగుతుంది. ఏవైనా ఆస్తులను జప్తు చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పుడు లోన్ రీపేమెంట్ గురించి మాట్లాడటం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఉక్రెయిన్‌లో సాధారణ స్థితి వచ్చిన తర్వాత.. విద్యార్థులు తమ కోర్సులను హైబ్రిడ్ మోడ్‌లో లేదా ఆన్‌లైన్‌లో పునఃప్రారంభించవచ్చు. కోర్సులను ముగించి ఆ తర్వాత చెల్లింపులు ప్రారంభించవచ్చు.’ అని చెప్పారు.

ఎడ్యుకేషన్ లోన్‌లలో ఒక చిన్న సౌకర్యం ఉందని, కోర్సు పూర్తయిన 6-12 నెలల తర్వాత ఆటోమేటిక్‌గా మారటోరియం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మారటోరియం వ్యవధి తర్వాత రుణం చెల్లింపు ప్రారంభమవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది విద్యార్థులు తమ కోర్సులను పూర్తి చేయలేకపోతున్నారని వివరించారు.

ఇతర కళాశాలల్లో చేరే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందా?

లోన్‌ తిరిగి చెల్లించడంపై లెక్కలు వేస్తూ కూర్చోవడం కంటే ఇతర కళాశాలల్లో చదువు కొనసాగించడంపై దృష్టి పెట్టడం మంచిదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ఎడ్యుకేషన్‌ లోన్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుందా? లేదా? చేసుకోవాల్సి ఉంటుంది. రుణదాతలు సాధారణంగా విద్యార్థుల మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుని విద్యా రుణాలను బదిలీ చేయడానికి అనుమతిస్తారు. ఉక్రెయిన్ సహేతుకమైన రుసుములతో మంచి వైద్య కోర్సులకు ప్రసిద్ధి. మరెక్కడా అలా ఉండకపోవచ్చు.

First published:

Tags: Education Loan, Russia-Ukraine War

ఉత్తమ కథలు