HOME »NEWS »BUSINESS »student started led bulb unit by sells his bike earns rs 2 5 lakh per month success story ns gh

LED Bulb: యూ ట్యూబ్ లో చూసి ఎల్ఈడీ బల్బుల తయారీ.. నెలకు రూ. 2.5 లక్షల ఆదాయం.. ఈ స్టూడెంట్ సక్సెస్ స్టోరీ తెలుసుకోండి

LED Bulb: యూ ట్యూబ్ లో చూసి ఎల్ఈడీ బల్బుల తయారీ.. నెలకు రూ. 2.5 లక్షల ఆదాయం.. ఈ స్టూడెంట్ సక్సెస్ స్టోరీ తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం

ఎల్‌ఈడీ బల్బుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక డిగ్రీ విద్యార్థి. అసలు ఎల్‌ఈడీ బల్బు పనిచేయడం ఎందుకు ఆగిపోతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతే అతడిని ఒక వ్యాపారవేత్తగా మార్చింది.

  • Share this:
ఎల్‌ఈడీ బల్బుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక డిగ్రీ విద్యార్థి. అసలు ఎల్‌ఈడీ బల్బు పనిచేయడం ఎందుకు ఆగిపోతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతే అతడిని ఒక వ్యాపారవేత్తగా మార్చింది. కరోనా లాక్‌డౌన్‌కు ముందు ఒక చిన్నపాటి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి నెలకు రూ.2.5 లక్షలు సంపాదిస్తున్నాడు త్రిపురలోని అల్గాపూర్ గ్రామానికి చెందిన రోహిత్ భట్టాచార్జీ. ఈ 22 ఏళ్ల యువకుడు ఇంగ్లీష్ ఆనర్స్ చదువుతున్నాడు. ముందు నుంచి అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనుకునే రోహిత్‌.. తన బైక్‌ను అమ్మి R B ఇల్యూమినేషన్స్‌ పేరుతో ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. అతడు ఇప్పుడు ఏడుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. రోజుకు 500 బల్బులను అమ్ముతూ, నెలకు రూ.2.5 లక్షలు సంపాదిస్తున్నాడు.

ఈ ఎల్‌ఈడీ బల్బుల తయారీ వెనుక ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఉందని చెబుతున్నాడు రోహిత్. 2020 జనవరిలో తన గదిలోని ఎల్‌ఈడీ బల్బ్ వెలగకపోవడంతో దాన్ని ఓపెన్ చేసి లోపల ఏముందో చూశాడు. దాంట్లో ఉన్న కాంపొనెంట్స్‌ను, వాటి పనితీరును యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకున్నాడు. బల్బు లోపల చాలా తక్కువ భాగాలు మాత్రమే ఉండటం అతడు గమనించాడు. వాటి ద్వారా సులభంగా ఎల్‌ఈడీ బల్బులను ఎలా తయారు చేయవచ్చో తెలుసుకున్నాడు. డ్రైవర్స్, క్యాప్, చిప్, బాడీ అనే భాగాలను జాగ్రత్తగా అసెంబుల్ చేస్తే చాలు.. ఎల్‌ఈడీ బల్బు తయారవుతుంది. ఇవన్నీ తెలుసుకున్న తరువాత ఎల్‌ఈడీ బల్బులను పూర్తిగా తయారు చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నాడు.



తల్లిదండ్రుల సాయంతో...
కానీ అప్పటికి రోహిత్ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. యూనిట్ స్థాపించడానికి తగినంత డబ్బు అతడి దగ్గర లేదు. దీంతో తన బైక్‌ను రూ.65,000కు అమ్మాడు. రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులైన తల్లిదండ్రులు రూ.3.5 లక్షలు ఇవ్వగలిగారు. వారి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశాడు. ఆ తరువాత ఎల్‌ఈడీ బల్బు కాంపొనెంట్స్‌ను స్థానికంగా కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి ఇందుకు అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను దిల్లీకి చెందిన వ్యాపారుల నుంచి ఆర్డర్ చేశాడు. గత సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి బల్బులకు చెందిన పరికరాలు, ముడి సరకు వచ్చాయి. వాటితో రోహిత్ స్వయంగా 50 వరకు ఎల్‌ఈడీ బల్బులను తయారు చేయగలిగాడు. అతడు రూపొందించిన మొదటి మూడు బల్బులను తన ఇంట్లోనే లైటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నాడు.

ధర తక్కువ..
లాక్‌డౌన్ విధించిన తరువాత రోహిత్ పూర్తిగా వీటి తయారీపై దృష్టి పెట్టాడు. ఒక్కో ఎల్‌ఈడీ బల్బును రూ.90కు అమ్ముతానని స్థానిక దుకాణాలను సంప్రదించాడు. వీటికి రెండేళ్లు వారంటీ కూడా ఇస్తున్నట్లు ప్రకటించాడు. నాణ్యమైన విడిభాగాలతో రూపొందించడంవల్ల వీటి పనితీరు మెరుగ్గా ఉంటుందని రోహిత్ కస్టమర్లకు నమ్మకం కలిగించాడు. బ్రాండెడ్ ఎల్‌ఈడీ బల్బులతో పోలిస్తే ధర చాలా తక్కువగా ఉండటం వల్ల తక్కువ కాలంలోనే ఈ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడింది. క్రమంగా డిమాండ్ పెరగడంతో ఏడుగురు వ్యక్తులను పనికి పెట్టుకుని.. తయారీ సామర్థ్యాన్ని పెంచాడు. వీరికి నెలకు రూ.12 వేలు జీతం ఇస్తున్నాడు.

వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళిక
ఒక వ్యక్తికి ఒక ఎల్‌ఈడీ బల్బ్ తయారు చేయడానికి పది నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన రోజుకు 100 బల్బులను సులువుగా ఉత్పత్తి చేయవచ్చని రోహిత్ చెబుతున్నాడు. మార్కెటింగ్ పెరిగిన తరువాత 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తిని అతడు మేనేజర్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వెంచర్‌ను R B ఇల్యూమినేషన్స్ (R B Illuminations) పేరుతో రిజిస్టర్ చేయించాడు. R B LED బ్రాండ్ పేరుతో అమ్ముతున్న బల్బులకు త్రిపురలోని చాలా జిల్లాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి పాట్నర్స్‌, డీలర్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు రోహిత్ చెబుతున్నాడు.
Published by:Nikhil Kumar S
First published:January 18, 2021, 13:37 IST

टॉप स्टोरीज