కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం రెండేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం 'పీఎం స్వనిధి పథకం' (PM Svanidhi Scheme) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద మొదట వ్యాపారులకు రూ.10,000 లోన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు చిరు వ్యాపారులకు రూ.50,000 వరకు రుణాలు ఇస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి (Covid 19 Pandemic) కారణంగా దెబ్బతిన్న వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థికంగా అండగా ఉండటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. వీధుల్లో చిన్నచిన్న షాపులు నిర్వహించేవారు, చిరు వ్యాపారులకు రుణాలను అందిస్తోంది. అయితే ఈ పథకంపై అవగాహన లేక చిరు వ్యాపారులు ప్రయోజనం పొందలేకపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2022 నవంబర్ 18 నాటికి రూ.5,000 కోట్లకు పైగా రుణాలను ఈ పథకం ద్వారా మంజూరు చేయడం విశేషం. మొత్తం 57,48,287 దరఖాస్తులు రాగా, 42,11,076 దరఖాస్తులకు ఆమోదముద్ర వేసింది. 37,03,529 దరఖాస్తుదారులకు రుణం మంజూరు చేసింది. మొత్తం రూ.5,064.88 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.4,241.23 కోట్లు చిరు వ్యాపారుల అకౌంట్లలో జమ అయ్యాయి. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే రుణం మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. పీఎం స్వనిధి పోర్టల్‌లో రియల్‌టైమ్ డేటా అందుబాటులో ఉంది.
Govt Schemes: మీకు ఏఏ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
పీఎం స్వనిధి పథకానికి మొదటిసారి దరఖాస్తు చేస్తే రూ.10,000 రుణం లభిస్తుంది. ఆ రుణాన్ని ఒక ఏడాదిలో తిరిగి చెల్లిస్తే రెండోసారి రూ.20,000 లోన్ తీసుకోవచ్చు. ఇక రెండోసారి కూడా లోన్ సకాలంలో తీర్చేస్తే మూడోసారి రూ.50,000 లోన్ తీసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పేమెంట్స్ చేస్తే వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.
వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, ఫుట్‌పాత్ వ్యాపారులు ఎవరైనా ఈ లోన్ తీసుకోవచ్చు. కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్మేవారు, టీ స్టాల్ నిర్వాహకులు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ లాంటి షాపులు నిర్వహించేవారు, ఇలా చిన్న వ్యాపారాలు చేసేవారు ఎవరైనా పీఎం స్వనిధి పథకం కింద రుణాలు తీసుకోవచ్చు. కమర్షియల్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటీవ్ బ్యంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, స్వయం సహాయక బృందాల బ్యాంకులు ఈ రుణాలు ఇస్తాయి.
Monthly Pension: నెలకు రూ.2 లక్షల పైనే పెన్షన్ ... ఇలా పొదుపు చేస్తే చాలు
Step 1- ముందుగా http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి I am not a robot పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత Request OTP బటన్ పైన క్లిక్ చేయాలి.
Step 4- మొబైల్ నెంబర్‌కు వచ్చిన 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి.
Step 5- ఆ తర్వాత Verify OTP పైన క్లిక్ చేయాలి.
Step 6- ఓటీపీ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయిన తర్వాత రెండో కేటగిరీ ఉంటుంది.
Step 7- స్ట్రీట్ వెండర్ కేటగిరీ సెలెక్ట్ చేయాలి.
Step 8- ఆ తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేసి ఫామ్ పూర్తి చేయాలి.
దరఖాస్తు విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Business Loan, Personal Finance, Pm modi, PM Narendra Modi