Loan: ఎవరికైనా ష్యూరిటీ సంతకం పెట్టారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Personal Loan | మీరు ఎవరికైనా అప్పు ఇప్పిచ్చారా? లోన్ గ్యారెంటర్‌గా ఉన్నారా? ష్యూరిటీ సంతకం పెట్టారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 6, 2020, 1:45 PM IST
Loan: ఎవరికైనా ష్యూరిటీ సంతకం పెట్టారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
Loan: ఎవరికైనా ష్యూరిటీ సంతకం పెట్టారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకులు కొన్ని రకాల రుణాలు ఇచ్చేప్పుడు లోన్ గ్యారెంటర్ సంతకం తీసుకుంటాయి. అంటే లోన్ తీసుకున్న వ్యక్తి తిరిగి అప్పు చెల్లించకపోతే నాది హామీ అన్నట్టు మరో వ్యక్తి నుంచి సంతకాలు తీసుకుంటాయి. ఇలాంటి సందర్భంలో లోన్ తీసుకున్న వ్యక్తి అప్పు చెల్లించకపోతే లోన్ గ్యారెంటర్‌గా ఉన్న వ్యక్తి చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇలా లోన్ గ్యారెంటర్‌గా ఉండటం కరోనా వైరస్ సంక్షోభ కాలంలో మరిన్ని చిక్కులు తీసుకురావడం ఖాయం. అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా లోన్ గ్యారెంటర్ సంతకం తీసుకుంటాయి. లోన్ తీసుకునే వ్యక్తి విశ్వసనీయతను గుర్తించడానికి లోన్ గ్యారెంటర్‌‌ను అడుగుతాయి. మరి మీరు ఇప్పటి వరకే ఎవరికైనా ష్యూరిటీ సంతకం పెట్టారా? గ్యారెంటర్‌గా ఉన్నారా? మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి.

TRAI App: కేబుల్, డీటీహెచ్ బిల్లు తగ్గించుకోవాలా? ఈ యాప్ ట్రై చేయండి

బ్యాంకుకు, రుణం తీసుకునే వ్యక్తికి మధ్య లోన్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇందులో వడ్డీ, చెల్లింపు విధానం, ప్రీ-పేమెంట్ ఛార్జీలకు సంబంధించిన నియనిబంధనలన్నీ లోన్ అగ్రిమెంట్‌లో ఉంటాయి. అయితే లోన్ కొనసాగుతున్న సమయంలో ఏవైనా నియమనిబంధనలు మారిస్తే హామీ ఇచ్చిన వ్యక్తికి సంబంధం ఉండదు. ఎందుకంటే బ్యాంకుకు, అప్పు తీసుకున్న వ్యక్తికి మధ్య జరిగిన చర్చల్లో హామీ ఇచ్చిన వ్యక్తి ప్రమేయం ఉండదు కాబట్టి. అంటే అప్పు తీసుకున్న వ్యక్తి రుణాలను రీస్ట్రక్చర్ చేస్తే ఇక గ్యారెంటర్‌కు ఏమాత్రం సంబంధం ఉండదు. "లోన్‌ను రీస్ట్రక్చర్ చేస్తే బ్యాంకుకు, అప్పు తీసుకున్న వ్యక్తికి మధ్య జరిగిన విషయం కాబట్టి గ్యారెంటర్‌కు బాధ్యత ఉండదు" అని ఫెడరల్ బ్యాంక్ హెడ్ లీగల్, వైస్ ప్రెసిడెంట్ శబ్నం పీఎం మనీకంట్రోల్‌కు వివరించారు.

Loan: కేవలం 10 సెకన్లలో లోన్... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త ఆఫర్

అయితే మారటోరియం విషయంలో ఈ నిబంధన పనిచేయదు. "లోన్ తీసుకున్న వ్యక్తి మారటోరియం ఎంచుకుంటారు కాబట్టి లోన్ అగ్రిమెంట్ నుంచి వైదొలిగినట్టు కాదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రుణగ్రహీతలకు ఇచ్చిన వెసులుబాటు అది" అని ఏఎన్‌బీ లీగల్‌కు చెందిన శ్రేణి షెట్టి వివరించారు. ఒకవేళ రుణగ్రహీత మారటోరియం ఎంచుకుంటే ఆ విషయాన్ని బ్యాంకులు గ్యారెంటర్‌కు తెలుపుతాయి. మీరు ఒకవేళ ఎవరికైనా గ్యారెంటర్‌గా ఉన్నా, ష్యూరిటీ సంతకం పెట్టినా లోన్ ఈఎంఐలు ఎలా చెల్లిస్తున్నారో తెలుసుకోవాలి. ఒకవేళ మారటోరియం ఎంచుకున్నట్టయితే మారటోరియం అప్రూవల్‌కు సంబంధించిన కాపీని తీసుకోవాలి.

Loan@Home: గుడ్ న్యూస్... ఇంటికి వచ్చి అప్పులు ఇస్తున్న ముత్తూట్ ఫైనాన్స్

కొన్ని రుణాలలో ఎగ్జిట్ క్లాజ్‌లు ఉంటాయి. అంటే లోన్ 40% రీపేమెంట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యేలా ఒప్పందం చేసుకోవచ్చు. అందులే లోన్ అగ్రిమెంట్‌లో ఎగ్జిట్ క్లాజ్‌ల గురించి తెలుసుకోవాలి. దీంతో పాటు గ్యారెంటర్‌ను రీప్లేస్ చేయమని కూడా కోరొచ్చు. రుణగ్రహీతకు, గ్యారెంటర్‌కు మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఈ విషయాన్ని అడగొచ్చు. అయితే కొత్త గ్యారెంటర్ దొరికే వరకు మీరే గ్యారెంటర్‌గా ఉండాల్సి వస్తుంది. మీరు గ్యారెంటర్‌గా ఉండటం తప్పు కాదు. అయితే ఇలాంటి సంక్షోభ సమయంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మీరు గ్యారెంటర్‌గా ఉన్న వ్యక్తి లోన్ చెల్లించగల స్థాయి తెలుసుకొని ముందడుగు వేయాలి. 

(ఈ ఆర్టికల్ మొదట Moneycontrol వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయింది. ఒరిజినల్ ఆర్టికల్‌ను ఇక్కడ చదవొచ్చు.)
Published by: Santhosh Kumar S
First published: July 6, 2020, 1:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading