స్టాక్ మార్కెట్లు ఢమాల్... సెన్సెక్స్ 1,000 పాయింట్ల నష్టం

స్టాక్ మార్కెట్లు ఢమాల్... సెన్సెక్స్ 1,000 పాయింట్ల నష్టం

ప్రతీకాత్మక చిత్రం

మొదట్లో సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమైనా ఆ తర్వాత 200 పాయింట్లు పుంజుకుంది. 800 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 300 పాయింట్లు పతనమై 10,200 పాయింట్ల దిగువన ప్రారంభమైంది.

  • Share this:
    స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది మరో దారుణమైన పతనం. పదులు, వందలు కాదు... ఏకంగా వెయ్యి పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. ఉదయం మార్కెట్ ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే మార్కెట్లు కుప్పకూలాయి. మొదట్లో సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమైనా ఆ తర్వాత 200 పాయింట్లు పుంజుకుంది. 800 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 300 పాయింట్లు పతనమై 10,200 పాయింట్ల దిగువన ప్రారంభమైంది.

    మరోవైపు రూపాయి విలువ 24 పైసలు క్షీణించడంతో ప్రస్తుతం 74.47 కనిష్టాన్ని తాకింది. ఓవైపు రూపాయి పతనం, మరోవైపు అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు