Stock Market : మార్కెట్లలో భూకంపం...వరుసగా రెండో రోజు భారీగా పతనమైన సెన్సెక్స్...100 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ...

మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 100.35 పాయింట్లు నష్టపోయి 11,497.90 పాయింట్ల వద్ద ముగిస్తే, సెన్సెక్స్ 323.71 పాయింట్లు నష్టపోయి 38,276.63 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ సైతం 330.30 పాయింట్లు నష్టపోయి 29288.20 పాయింట్ల వద్ద ముగిసింది.

news18-telugu
Updated: May 7, 2019, 4:53 PM IST
Stock Market : మార్కెట్లలో భూకంపం...వరుసగా రెండో రోజు భారీగా పతనమైన సెన్సెక్స్...100 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 7, 2019, 4:53 PM IST
స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజు కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నిఫ్టీ ఈ వారం రెండో రోజు కూడా 100 పాయింట్లకు పైగా నష్టపోయి, కీలకమైన 11500 పాయింట్ల దిగువన క్లోజైంది. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 100.35 పాయింట్లు నష్టపోయి 11,497.90 పాయింట్ల వద్ద ముగిస్తే, సెన్సెక్స్ 323.71 పాయింట్లు నష్టపోయి 38,276.63 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ సైతం 330.30 పాయింట్లు నష్టపోయి 29288.20 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌లో హెవీ వెయిట్ స్టాక్స్ గా పరిగణించే రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.99 శాతం) , ఐసీఐసీఐ బ్యాంక్ (-3.69 శాతం), ఐటీసీ (-1.51 శాతం), ఐవోసీ (-1.98 శాతం), టాటా మోటార్స్ (-4.60 శాతం), జెఎస్ డబ్ల్యు స్టీల్ (-2.88 శాతం) నష్టపోయి ప్రధాన సూచీలను బలహీన పరిచాయి. ఇక సెక్టార్ల పరంగా చూసినట్లయితే ఐటీ మినహా దాదాపు అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఏకంగా -1.12 శాతం నష్టపోగా, అటు ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో అమ్మకాలు భారీగా జరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 3.69 శాతం నష్టపోగా, బ్యాంక్ ఆఫ్ బరోడా -2.97 శాతం, ఎస్బీఐ -1.07 శాతం, పీఎన్బీ -2.67 శాతం నష్టపోయింది.

మరో సెక్టార్ నిఫ్టీ ఎనర్జీ సైతం -1.65 శాతం నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ - 2.99 శాతం, భారత్ పెట్రోల్ - 2.95 శాతం నష్టపోయాయి. అలాగే హిందుస్తాన్ పెట్రోలియం, ఐవోసి షేర్లు సైతం 2 శాతం చొప్పున నష్టపోయాయి. అలాగే మరో వైపు ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది. యూఎస్-చైనా ట్రేడ్ వార ప్రకంపనల నేపథ్యంలో ప్రధానంగా మెటల్ స్టాక్స్ భారీగా పతనమవుతున్నాయి. అలాగే కంపెనీల త్రైమాసిక ఫలితాలు సైతం మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే ఎన్నికల ఫలితాల మీద కూడా మార్కెట్లు కన్నేయడంతో మదుపరులు అప్రమత్తంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...