STOCK MARKET THESE STOCKS CAN GIVE 10 TO 15 PC PROFIT POST COVID MK
Stock Market: ఈ స్టాక్స్ లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే 10 వేలు పక్కా...
ప్రతీకాత్మక చిత్రం
నిఫ్టీ స్టాక్స్ మీద పెట్టుబడి దీర్ఘ కాలికంలో 10-12 శాతం వరకూ ప్రాఫిట్లను అందించవచ్చని మోతీలాల్ ఓశ్వాల్ భావిస్తుంది. ఇవి మల్టీ బ్యాగర్లు కాకపోయినప్పటికీ మంచి రిటర్న్స్ ను మాత్రం అందించనున్నాయని మోతీలాల్ పేర్కొంటుంది.
స్టాక్ మార్కెట్లు కోవిడ్ దెబ్బ నుంచి కోలుకుంటున్నాయి. ఇప్పటికే దేశీయ మార్కెట్లో రికవరీ బాట పట్టగా, బంగారం ధరలు కూడా భారీగా దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో మదుపరులు వేల్యూడ్ స్టాక్స్ వైపు కన్నేశారు. మార్కెట్లు మార్చ్ లోయర్ లెవల్స్ దాటి ముందుకు సాగుతున్నప్పటికీ, లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇంకా అస్థిరత కనబడుతూనే ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకుని మరీ నిలబడ్డాయి. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL), హిందుస్థాన్ యూనీలివర్ (HUL), HDFC బ్యాంక్ వంటివి మార్చ్ తరువాత నుండి మంచి పనితీరునే కనబరిచాయి. ఇలాంటి స్టాక్స్ మీద ఇన్వెస్టర్లు తెలివిగా పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ బూమ్‌లో వీటి పాత్ర ఎంతైనా ఉండొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ స్టాక్స్ మీద పెట్టుబడి దీర్ఘ కాలికంలో 10-12 శాతం వరకూ ప్రాఫిట్లను అందించవచ్చని మోతీలాల్ ఓశ్వాల్ భావిస్తుంది. ఇవి మల్టీ బ్యాగర్లు కాకపోయినప్పటికీ మంచి రిటర్న్స్ ను మాత్రం అందించనున్నాయని మోతీలాల్ పేర్కొంటుంది.
బ్లూంబెర్గ్ సంస్థ వెల్లడించిన డెటా ప్రకారం నిఫ్టీ లోని ఓ 10 టాప్ స్టాక్స్ ఎనలిస్టుల ఫేవరెట్లుగా ఉన్నాయని పేర్కొంది. ICICI బ్యాంక్ స్టాక్ మీద 58 మంది ఎనలిస్టులు "buy " కాల్స్‌ను ఇస్తున్నారు. ఇంకా వీటిలో HDFC లిమిటెడ్, RIL, బ్రిటానియా వంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. ఈ నిఫ్టీ టాప్ 10 స్టాక్స్ FY21 నాటికి మరింత లాభదాయకంగా మారనున్నాయని ఎనలిస్టుల అంచనా.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.