బలం పుంజుకున్న రూపాయి...లాభాల్లో సూచీలు

సోమ, మంగళవారాల్లో సెన్సెక్స్ 800 పాయింట్లు నష్టపోవడంతో మదుపర్లకు దాదాపు రూ.2.71 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.

news18-telugu
Updated: September 19, 2018, 11:38 AM IST
బలం పుంజుకున్న రూపాయి...లాభాల్లో సూచీలు
లాభాల్లో కొనసాగుతున్న సూచీలు
  • Share this:
రూపాయి విలువ బలంపుంజుకుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత రెండు ట్రేడింగ్ సోషన్స్‌లో 800 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్...బుధవారం లాభాల్లో ట్రేడ్ అవుతోంది. కొనుగోళ్ల మద్దతుతో ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 150 పాయింట్ల మేర లాభపడింది. కొద్ది సేపటి క్రితం సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 37,393పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అటు నిఫ్టీ కూడా 33 పాయింట్ల లాభంతో 11,312 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

సెన్సెక్స్ సోమవారం 505 పాయింట్లు, మంగళవారం 295 పాయింట్లు నష్టపోయింది. రెండ్రోజుల్లో 800 పాయింట్లు నష్టపోవడంతో మదుపర్లకు దాదాపు రూ.2.72 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.


ఇది కూడా చదవండి..రెండ్రోజుల్లో మదుపర్లకు రూ.2.72లక్షల కోట్ల నష్టం!

పుంజుకున్న రూపాయి విలువ


ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి మారకం విలువ కాస్త పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ నిన్నటి ముగింపుపై 36 పైసలు పుంజుకుని 72.62 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడాయిల్ ధరలు పెరగడం, చైనా-అమెరికాల మధ్య ట్రేడ్ వార్ భయాల నేపథ్యంలో మంగళవారం రూపాయి మారకం విలువ 47 పైసలు క్షీణించి రికార్డు కనిష్ఠ స్థాయిలో 72.98 వద్ద ముగిసింది. బుధవారం ఉదయం 27 పైసలు లాభంతో రూపాయి 72.71 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
First published: September 19, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>