Stock Market : స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్ పోల్స్ జోష్.. 537 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్...

సెన్సెక్స్ 500 పాయింట్లు లాభఫడటం వెనుక ఎగ్జిట్ పోల్స్ ప్రభావం కూడా కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే 19న విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్ లో ప్రధానంగా కేంద్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పడనుందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో మార్కెట్లు గ్లోబల్ క్యూస్ కూడా పట్టించుకోకుండా ర్యాలీలో పాల్గొన్నాయి.

news18-telugu
Updated: May 17, 2019, 4:17 PM IST
Stock Market : స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్ పోల్స్ జోష్.. 537 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్...
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఫైల్ చిత్రం)
news18-telugu
Updated: May 17, 2019, 4:17 PM IST
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ ఏకంగా 150 పాయింట్లు లాభపడి 11407.20 పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ కూడా 537 పాయింట్లు లాభపడి 37930 పాయింట్ల వద్ద ముగిసింది. మరో కీలక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ సైతం ఏకంగా 594 పాయింట్లు లాభపడింది. సెక్టార్ పరంగా చూస్తే ఐటీ, ఫార్మా, మెటల్స్ మినహా అన్ని సెక్టార్లలో భారీగా కొనుగోళ్లు కనిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా, మిడ్ క్యాప్స్ లో భారీగా కొనుగోళ్లు కనిపించాయి. బ్యాంకింగ్ స్టాక్స్ లో ప్రధానంగా యాక్సిస్ బ్యాంక్ 2.34 శాతం లాభపడగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ లాంటి షేర్లు 2 శాతం చొప్పున లాభపడ్డాయి. అలాగే ఆటో స్టాక్స్‌లో బజాజ్ ఆటో షేర్లు భారీగా లాభఫడ్డాయి. ఇంట్రాడేలో దాదాపు 3.31 శాతం శాతం లాభపడ్డాయి. అలాగే హీరో మోటోకార్ప్ 4 శాతం, మారుతి సుజుకి 3.51 శాతం, టాటా మోటార్స్ 0.83 శాతం లాభపడ్డాయి. అలాగే ఎఫ్ఎంసీజీ లో సైతం ఐటీసీ 2.26 శాతం, మారికో 2.37 శాతం, టాటా గ్లోబల్ బేవరేజ్ 6.61 శాతం లాభఫడ్డాయి.

టాప్ గెయినర్స్ విషయానికి వస్తే జీఎంటర్ టైన్‌మెంట్ 7.65 శాతం లాభపడగా, బజాజ్ ఫైనాన్స్ 6.14 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 4.93 శాతం, హీరో మోటో కార్ప్ 4 శాతం, మారుతి సుజుకి 3.51 శాతం లాభఫడ్డాయి. అలాగే ఇక టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ 2.61 శాతం నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, హింద్ పెట్రోల్ 2 శాతం చొప్పున నష్టపోయాయి.

ఇదిలా ఉంటే సెన్సెక్స్ 500 పాయింట్లు లాభఫడటం వెనుక ఎగ్జిట్ పోల్స్ ప్రభావం కూడా కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే 19న విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్ లో ప్రధానంగా కేంద్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పడనుందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో మార్కెట్లు గ్లోబల్ క్యూస్ కూడా పట్టించుకోకుండా ర్యాలీలో పాల్గొన్నాయి. స్థిర ప్రభుత్వం ఏర్పడితే మాత్రం నిఫ్టీ ఈ సంవత్సరం చివరినాటికి 13000-15000 పాయింట్ల రేంజ్ కి చేరే అవకాశం ఉంది. అయితే కేంద్రంలో స్థిరప్రభుత్వం ఏర్పడకపోతే మాత్రం నిఫ్టీ 9000 పాయింట్ల దిగువకు పతనమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నాయి. దీంతో పాటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఫలితాలు సైతం మార్కెట్లకు బలాన్ని చేకూర్చాయి. మార్చ్ క్వార్టర్ లో బజాజ్ ఫైనాన్స్ నికరలాభం ఏకంగా 50 శాతం నమోదు చేయగా, బజాజ్ ఫిన్ సర్వ్ నికరలాభం కూడా 32 శాతం నమోదు చేయడం విశేషం.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...