2014లో ఈ షేర్లు కొని ఉంటే ఎంత లాభపడేవారు ? మోదీ సర్కారులో స్టాక్ మర్కెట్ దూకుడు ఎలా ఉంది..?

2014లో మోదీ సర్కారు ఏర్పడినప్పుడు ప్రధాన సూచీల్లోని షేర్లను కొనుగోలు చేసి హోల్డ్ చేసిన మదుపరులు ఈ ఐదేళ్లలో భారీగా లాభపడ్డారు. ముఖ్యంగా నిఫ్టీ, సెన్సెక్స్ ప్రధాన సూచీల్లోని షేర్లను సొంతం చేసుకొని ఉంటే దాదాపు 60 శాతం లాభపడి ఉండేవారు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో సైతం పెట్టుబడులు పెట్టి ఉంటే దాదాపు 100 శాతం పైగా లాభం పొందేవారు.

news18-telugu
Updated: May 17, 2019, 3:42 PM IST
2014లో ఈ షేర్లు కొని ఉంటే ఎంత లాభపడేవారు ? మోదీ సర్కారులో స్టాక్ మర్కెట్ దూకుడు ఎలా ఉంది..?
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, ప్రధాని మోదీ (ఫైల్ చిత్రం)
news18-telugu
Updated: May 17, 2019, 3:42 PM IST
మోదీ ప్రభుత్వం పరిపాలన 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరోవైపు ఎన్నికల ఫలితాలకు సైతం మరికొద్ది రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాల్లో మోదీ పాలనలో స్టాక్ మార్కెట్లు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశాయో చూద్దాం. గత 5 సంవత్సరాల్లో దేశీయ ప్రధాన బెంచ్ మార్క్ సూచీ అయిన నిఫ్టీ 50 ఇండెక్స్ 58 శాతం రిటర్న్ ఇవ్వగా, అదే సమయంలో సెన్సెక్స్ 57 శాతం రిటర్న్ ఇచ్చింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 103 శాతం రిటర్న్ ఇవ్వడం ప్రత్యేకమనే చెప్పవచ్చు. ఇక మిడ్, స్మాల్ క్యాప్స్ విషయానికి వస్తే మిడ్ క్యాప్ సూచీ 140 శాతం రిటర్న్ ఇస్తే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 78 శాతం రిటర్న్ ఇచ్చింది. ప్రధాన సూచీల గణాంకాలను చూస్తే మోదీ సర్కారు అధికారం చెప్పటిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు షేర్ల పరంగా ఏఏ షేర్లు గత 5 సంవత్సరాల్లో ఔట్ పెర్ఫార్మ్ చేశాయో చూద్దాం. ముందుగా పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో ఎస్‌బీఐ బ్యాంక్ షేరు 7 శాతం పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదే సమయంలో కెనరా బ్యాంక్ 5 శాతం, పీఎన్‌బీ 13 శాతం, కార్పోరేషన్ 15.5 శాతం నెగిటివ్ రిటర్న్ ఇవ్వడంతో వెనుకబడ్డాయి. ఇక ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే మోదీ సర్కారులో కోటక్ బ్యాంక్ అత్యధికంగా 26 శాతం లాభపడింది. అలాగే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 24 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 22 శాతం, ఎస్ బ్యాంక్ 8 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 8 శాతం లాభపడ్డాయి.

ఇక మోదీ పాలనలో ఆటో షేర్ల విషయానికి వస్తే మారుతి 26 శాతం రిటర్న్ ఇచ్చింది. ఐషర్ 24 శాతం, బజాజ్ ఆటో 8 శాతం, ఎం అండ్ ఎం 2.5 శాతం, హీరో మోటో అత్యల్పంగా 0.6 శాతం రిటర్న్ ఇచ్చాయి. అయితే టాటా మోటార్స్ మాత్రం 16 శాతం నెగిటివ్ రిటర్న్ ఇవ్వడం గమనార్హం. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ షేర్లలో గత 5 సంవత్సరాల పెర్ఫార్మెన్స్ చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 19 శాతం, బీపీసీఎల్ 16 శాతం, ఐవోసీ 13 శాతం, గెయిల్ 9 శాతం రిటర్న్‌తో లాభపడ్డాయి. ఇక మెటల్స్ విషయానికి వస్తే జేఎస్‌డబ్ల్యు స్టీల్ షేర్లు 19.5 శాతం లాభపడగా, టాటా స్టీల్ 2 శాతం మాత్రమే రిటర్న్ ఇచ్చింది. అలాగే సమయంలో ఐటీ కంపెనీల్లో చూస్తే టీసీఎస్ 14 శాతం, ఇన్ఫోసిస్ 12 శాతం, టెక్ మహీంద్రా 11 శాతం, హెచ్సీఎల్ టెక్ 9 శాతం లాభఫడ్డాయి.

అంటే మోదీ సర్కారు ఏర్పడినప్పుడు ఈ షేర్లను కొని హోల్డ్ చేసిన మదుపరులు భారీగా లాభపడ్డారు. ముఖ్యంగా నిఫ్టీ, సెన్సెక్స్ ప్రధాన సూచీల్లోని షేర్లను సొంతం చేసుకొని ఉంటే దాదాపు 60 శాతం లాభపడి ఉండేవారు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో సైతం పెట్టుబడులు పెట్టి ఉంటే దాదాపు 100 శాతం పైగా లాభం పొందే వారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...