Home /News /business /

STOCK MARKET NIFTY TURNS POSITIVE FOR MONTH SENSEX GAINS 450 PTS INDIABULLS HOUSING SURGES 13 PERCENT MK

Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు...450 పాయింట్ల లాభంలో సెన్సెక్స్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మధ్యాహ్నం సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 440 పాయింట్ల లాభపడి 37,770 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి 11170 పాయింట్ల పైగా ట్రేడవుతోంది.

    స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల సందడి నెలకొంది. మధ్యాహ్నం సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 440 పాయింట్ల లాభపడి 37,770 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి 11170 పాయింట్ల పైగా ట్రేడవుతోంది. టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏకంగా 11 శాతం లాభపడింది. ఇక వేదాంత 4 శాతం, బజాజ్ ఫిన్ సరవ్్ 3.68 శాతం, ఐషర్ మోటార్స్ 3.66 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ 5.33 శాతం, కోల్ ఇండియా 1.44 శాతం, ఐటీసీ 1.11 శాతం నష్టపోయాయి. సెక్టార్ పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ 1.29 శాతం లాభపడింది. నిఫ్టీ మెటల్స్ సూచీ సైతం 0.97 శాతం లాభపడింది. ఆటోలో కొనుగోళ్ల సందడి నెలకొంది. నిఫ్టీ ఆటో సూచీ +1.9 శాతం లాభఫడింది. మారుతి సుజుకి ఏకంగా 3.45 శాతం లాభఫడింది. టాటా మోటార్స్ సైతం 1.45 శాతం లాభపడింది.

    ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై అధిక సర్‌చార్జీ విధింపు ప్రతిపాదనను ఉపసంహరించుకునే అవకాశం ఉందనే వార్తలతో మార్కెట్లు కదం తొక్కాయి. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ను ప్రభుత్వం రివ్యూ చేసే ఆస్కారం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు బ్రేక పడింది. మరోవైపు ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గించే వీలుందనే వార్తలు కూడా సెంటిమెంటును బలపరిచాయి.
    First published:

    Tags: Nifty, Sensex, Share price, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు