STOCK MARKET NIFTY CLOSES BELOW 11000 AT WEEKEND BENCHMARK INDICES REGISTERED A STRONG RECOVERY MK
Stock Market: వారాంతంలో కోలుకున్న మార్కెట్లు...11 వేల దిగువనే నిఫ్టీ...
ప్రతీకాత్మక చిత్రం
శుక్రవారం ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ 118.69 పాయింట్లు లాభపడి 37,137.01 వద్ద పాజిటివ్ గా ముగియగా, నిఫ్టీ 17.40 పాయింట్లు లాభపడి 10,997.40 వద్ద పాజిటివ్ గా ముగిసింది.
స్టాక్ మార్కెట్లు వారాంతంలో రికవరీ బాట పట్టాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ గా నోట్ తో ముగిశాయి. అయినప్పటికీ నిఫ్టీ 11000 పాయింట్ల కీలక స్థాయికి కేవలం మూడు పాయింట్ల దిగువన నిలిచింది. శుక్రవారం ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ 118.69 పాయింట్లు లాభపడి 37,137.01 వద్ద పాజిటివ్ గా ముగియగా, నిఫ్టీ 17.40 పాయింట్లు లాభపడి 10,997.40 వద్ద పాజిటివ్ గా ముగిసింది. ఇండియాబుల్స్ హౌసింగ్, టాటా స్టీల్, ఎస్బీఐ, కోల్ ఇండియా, విప్రో మేజర్ లూజర్స్ గా సూచీలను బలహీన పరచగా, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పేయింట్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, మారుతి సుజుకిలు సూచీలను బలోపేతం చేశాయి. ఇక సెక్టార్ వైస్ చూసినట్లయితే ఆటో, ఇన్ఫ్రా, ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్లు కనిపించాయి. అదే మయంలో పీఎస్యూ బ్యాంకులు, మెటల్, ఎనర్జీ స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఇదిలా ఉంటే మిడ్ క్యాప్ సూచీ ఫ్లాట్ గా ముగియగా, స్మాల్ క్యాప్ సూచీ మాత్రం 0.5శాతం నష్టపోయింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.