కేంద్ర బడ్జెట్ మదుపర్లకు రుచించకపోవడంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన శుక్రవారం రోజున బీఎస్ఈ సెన్సెక్స్ 395 పాయింట్లు నష్టపోగా..నిన్న(సోమవారం) ఓ దశలో 900 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు 793 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇవాళ(మంగళవారం) కూడా సూచీలు నేలచూపు చూస్తున్నాయి. ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా నష్టపోయింది.
కొద్ది సేపటి క్రితం బీఎస్ఈ సెన్సెక్స్ 272 పాయింట్ల నష్టంతో 38,449 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుండగా...నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 11,466 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టైటాన్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్ల మేర నష్టపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూన్ 3 తేదీన 156.14 లక్షల కోట్లుగా ఉండగా...ఇది జులై 8 నాటికి రూ.148.23 లక్షల కోట్లకు క్షీణించింది. దీంతో మదుపర్ల సంపద దాదాపుగా రూ.8 లక్షల కోట్లు ఆవిరయ్యింది. మంగళవారం నాటి నష్టాలను కూడా కలుపుకునేందుకు నష్టం రూ.10 లక్షల కోట్లకు పైమాటే.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.