news18-telugu
Updated: November 17, 2020, 10:52 AM IST
ఫ్రతీకాత్మకచిత్రం
స్టాక్ మార్కెట్లు రికార్డు మోత మోగిస్తున్నాయి. ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. ఈ రోజు ఓపెనింగ్ నుంచే స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయి వద్ద ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 12850 ఎగువన ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్ కూడా 319 పాయింట్లు లాభపడి 43957 వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. సెక్టార్ పరిగా చూసినట్లయితే, బ్యాంక్ నిఫ్టీ 1 శాతం లాభపడింది. అలాగే మెటల్ స్టాక్స్ కూడా చక్కటి పెర్ఫార్మెన్స్ చూపించాయి. నిఫ్టీ మెటల్స్ సూచీ 3 శాతం లాభపడింది. ఆటో షేర్లలో కూడా స్వల్ప లాభం నమోదు చేసింది. ఇక ఐటీ, ఫార్మా షేర్లు స్వల్పంగా ఒడిదిడుకులకు లోనవుతున్నాయి. టాప్ గెయినర్స్ విషయానికి వస్తే టాటా స్టీల్ 7 శాతం లభపడింది, అలాగే టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, SBI, హిందాల్కో షేర్లు 2-3 శాతం లాభపడ్డాయి. అలాగే టాప్ లూజర్లుగా భారత్ పెట్రోలియం, హీరో మోటోకార్ప్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక అర్బన్ లాడర్ కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మేజర్ వాటాలకు కొనుగోలు చేయడంతో రిలయన్స్ షేర్లు 1 శాతం లాభపడ్డాయి.
Published by:
Krishna Adithya
First published:
November 17, 2020, 10:52 AM IST