హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock Market: వరుస నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్...సెన్సెక్స్ 497, నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో ముగింపు

Stock Market: వరుస నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్...సెన్సెక్స్ 497, నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో ముగింపు

రెండు రోజుల వరుస పతనాల తర్వాత స్టాక్ మార్కెట్ ఈరోజు లాభాల్లో ముగిసింది. మంగళవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 497 పాయింట్లు లాభపడి 56,319 వద్ద, నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 16771 వద్ద ముగిశాయి.

  రెండు రోజుల వరుస పతనాల తర్వాత స్టాక్ మార్కెట్ ఈరోజు లాభాల్లో ముగిసింది. మంగళవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 497 పాయింట్లు లాభపడి 56,319 వద్ద, నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 16771 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ సమయంలో మెటల్ రంగ షేర్లలో అత్యధిక లాభాలు నమోదయ్యాయి. స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు లాభాలతో ప్రారంభమై మధ్యాహ్నం ట్రేడింగ్‌ నాటికి ప్రధాన సూచీలు ఎగువ స్థాయిలకు చేరుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ గరిష్ట స్థాయి 56,900.74 వద్దకు చేరుకుంది. ఇది మునుపటి ముగింపు స్థాయి కంటే 1078 పాయింట్లు ఎక్కువ. మార్కెట్ ఎగువ స్థాయిలను కొనసాగించలేకపోవడం, ఎగువ స్థాయిల నుంచి దాదాపు 600 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ క్లోజయినా.. మెటల్ సెక్టార్, హెవీ వెయిట్ షేర్ల కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ లో నేటి పెరుగుదల కనిపించింది. టిసిఎస్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండూ ఈరోజు దాదాపు ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి.

  Flipkart Big Saving Days Sale 2021: ఫ్లిప్‌కార్ట్ లో బంపరాఫర్.. కేవలం రూ.2,549కే Samsung F42 5G స్మార్ట్ ఫోన్

  నేటి వ్యాపారంలో, మెటల్ రంగంలో అత్యధిక పెరుగుదల కనిపించింది. సెక్టార్ ఇండెక్స్ 2.94 శాతం లాభంతో ముగిసింది. ఇదే సమయంలో మీడియా సెక్టార్‌లో 2.54 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 2.06 శాతం, ఐటీ రంగంలో 1.98 శాతం, రియల్టీ సెక్టార్‌లో 1.61 శాతం, ఎనర్జీ సెక్టార్‌లో 1.16 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్, ఆటో రంగాలు కూడా నేడు లాభాలతో ముగిశాయి. కానీ వారి వృద్ధి 1 శాతం కంటే తక్కువ.

  First published:

  Tags: Stock Market

  ఉత్తమ కథలు