హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multibagger stock: లక్ష పెట్టుబడి పెడితే రూ.30 లక్షల రాబడి.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం

Multibagger stock: లక్ష పెట్టుబడి పెడితే రూ.30 లక్షల రాబడి.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Multibagger stock: మార్కెట్ పరిస్థితులు అనుకూలించడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని స్టాక్స్ రెట్టింపు స్థాయిలో లాభాలను ఆర్జిస్తూ మల్టీబ్యాగర్ స్టాక్స్ జాబితాలో చేరుతున్నాయి. ఇందులో రఘువీర్ సింథటిక్స్ షేర్లు కూడా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి (Corona pandemic) తర్వాత స్టాక్ మార్కెట్లు (Stock Markets) కొత్త రికార్డులతో దూసుకుపోతున్నాయి. మార్కెట్ పరిస్థితులు అనుకూలించడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని స్టాక్స్ రెట్టింపు స్థాయిలో లాభాలను ఆర్జిస్తూ మల్టీబ్యాగర్ స్టాక్స్ జాబితాలో చేరుతున్నాయి. నిర్ణీత వ్యవధిలో 100% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే ఈక్విటీ స్టాక్‌ను మల్టీబ్యాగర్ స్టాక్ అంటారు. గత ఆరు నెలల్లో ఈ జాబితాలో పెద్ద మొత్తంలో స్టాక్స్ ప్రవేశించాయి. ఇందులో రఘువీర్ సింథటిక్స్ (Raghuveer Cements) షేర్లు కూడా ఉన్నాయి. గత ఆరు నెలల్లో ఈ టెక్స్‌టైల్ సంస్థ స్టాక్ ఒక్కో షేరు దాదాపు రూ.20 నుంచి రూ.600.40 వరకు పెరిగింది. ఇంత తక్కువ వ్యవధిలో దాదాపు 30 రెట్లు రాబడిని ఆర్జించింది.

Income Tax: కొత్త, పాత పన్ను వ్యవస్థల్లో ఏది మంచిది ..? టాక్స్ ఎలా చెల్లిస్తే బెటర్..

* రఘువీర్ సింథటిక్స్ షేర్ వాల్యూ ఎలా పెరిగింది?

గత వారంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ విలువ రూ.494 నుంచి రూ.600కు పెరిగింది. అంటే ఒక వారంలోనే దాదాపు 21.5 శాతం పెరిగింది. గత వారం ట్రేడింగ్‌లో ఈ టెక్స్‌టైల్ స్టాక్ మొత్తం 5 ట్రేడ్ సెషన్లలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. గత నెలలో రఘువీర్ సింథటిక్స్ షేర్ ధర రూ.216 నుంచి రూ.600కు చేరుకుంది. ఈ వ్యవధిలో షేర్ విలువ దాదాపు 175 శాతం పెరిగింది. గత ఆరు నెలల వ్యవధిలో చూస్తే.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ విలువ దాదాపు రూ.20 నుంచి రూ.600కు పెరిగింది. అంటే ఈ ఆరు నెలల వ్యవధిలోనే స్టాక్ వాల్యూ దాదాపు 2900 శాతం పెరగడం విశేషం.

Cooking Oils: వంట నూనెల మళ్లీ తగ్గుతాయా ? పెరుగుతాయా ?.. మార్కెట్ వర్గాలు ఏం చెబుతున్నాయి.

* పెట్టుబడిపై ఎలాంటి ప్రభావం చూపింది?

రఘువీర్ సింథటిక్స్ షేర్ ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. షేర్ వాల్యూ పరంగా పెట్టుబడులు అందించిన రాబడులు ఇన్వెస్టర్లకు గరిష్ట ప్రయోజనాలను అందించాయి. ఒక పెట్టుబడిదారుడు ఒక వారం క్రితం ఈ కౌంటర్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఈ రోజు ఆ మొత్తం రూ.1.21 లక్షలకు చేరి ఉండేది. ఒక ఇన్వెస్టర్ ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ టెక్స్‌టైల్ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ నేటికి రూ.2.75 లక్షలకు చేరుకునేది. అయితే ఒక పెట్టుబడిదారుడు ఆరు నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే.. దాని విలువ ఈరోజు రూ.30 లక్షలకు చేరి ఉండేది.

EPFO Alert: ఈపీఎఫ్ఓ కొత్త రూల్... ఇక వారికి ఎలాంటి డెడ్‌లైన్ ఉండదు

* షేర్‌ హోల్డర్స్‌కు ఆల్ఫా రిటర్న్

గత ఆరు నెలల వ్యవధిలో కీలకమైన బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50.. 11 శాతం రాబడిని అందించగా, BSE సెన్సెక్స్ 12 శాతం రాబడిని ఇచ్చింది. కాబట్టి ఈ మల్టీబ్యాగర్ టెక్స్‌టైల్ స్టాక్ 2021లో ఆల్ఫా స్టాక్‌లలో ఒకటిగా మారింది. ఎందుకంటే ఇది షేర్ హోల్డర్స్‌కు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. మార్కెట్ ఇండెక్స్ లేదా ఇతర బెంచ్‌మార్క్‌తో పోలిస్తే, పెట్టుబడి తిరిగి వచ్చిన రాబడి మొత్తాన్ని ఆల్ఫా రిటర్న్ సూచిస్తుంది. ఇది మొత్తం మార్కెట్ మూవ్‌మెంట్స్‌ను సూచిస్తుంది.

First published:

Tags: Business, Money, Share price, Stock Market

ఉత్తమ కథలు