Stock Market: రూపీ పతనం, చమురు పోటుతో స్టాక్ మార్కెట్లలో బేజారు...

చమురు ధరల పెరుగుదల మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీస్తోంది. నిఫ్టీ కీలక స్థాయి 11600 పాయింట్ల దిగువన ముగిసింది. సెక్టార్స్ పరంగా చూసినట్లయితే ఆటో, మెటల్, రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్స్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

news18-telugu
Updated: April 23, 2019, 5:20 PM IST
Stock Market: రూపీ పతనం, చమురు పోటుతో స్టాక్ మార్కెట్లలో బేజారు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 5:20 PM IST
వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి 18 పాయింట్లు నష్టపోయి 11575 పాయింట్ల వద్ద నెగిటివ్ ముగిసింది. అదే సమయంలో మరో కీలక సూచీ సెన్సెక్స్ సైతం 80 పాయింట్లు నష్టపోయి 38564 పాయింట్ల వద్ద నెగిటివ్ గా ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ సైతం 208 పాయింట్లు నష్టపోయి 29479 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కీలక స్థాయి 11600 పాయింట్ల దిగువన ముగిసింది. సెక్టార్స్ పరంగా చూసినట్లయితే ఆటో, మెటల్, రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్స్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఆటో సూచీ ఏకంగా 1.49 శాతం నష్టపోగా, టాటా మోటార్స్ 1.36శాతం, ఎం అండ్ ఎం 1.14 శాతం, మారుతి సుజుకి 3.72 శాతం నష్టపోయాయి. అయితే ఫార్మా స్టాక్స్ మాత్రం కొనుగోళ్ల జోరును చూపించాయి. ముఖ్యంగా లుపిన్ 4.32 శాతం లాభపడగా, సన్ ఫార్మా 3.09 శాతం లాభపడగా, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్ మార్క్ ఫార్మా, బయోకాన్ లాంటి స్టా్క్స్ 1 శాతం చొప్పున లాభపడ్డాయి.

బ్యాంకింగ్ స్టాక్స్‌లో సైతం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఎస్బీఐ 1.55 శాతం నష్టపోగా, ఆర్బీఎల్ 1.55 శాతం, ఎస్ బ్యాంక్ 2.37 శాతం నష్టపోయింది. అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం 1.03 శాతం నష్టపోయింది.

ఇక మార్కెట్లలో ఓఎన్జీసీ 3.70 శాతం లాభపడగా, జీ ఎంటర్ టెయిన్ మెంట్స్, సన్ ఫార్మా, హింద్ పెట్రోల్, బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అదే సమయంలో భారతీ ఎయిర్ టెల్ 9.42 శాతం నష్టపోయి టాప్ లూజర్ గా నిలవగా, మారుతి సుజుకి ఇండియా, ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ టాప్ లూజర్లుగా చార్ట్స్‌లో నష్టపోయాయి.

చమురు సెగలు, రూపీ పతనంతో మార్కెట్లు కుదేలు :


చమురు ధరల పెరుగుదల మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీస్తోంది. ఇరాన్ ఆయిల్ దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో క్రూడ్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 74.67 డాలర్లు పలకగా, గడిచిన ఆరు నెలల్లో ఇదే అత్యధికం. దీంతో పాటు రూపీ విలువ డాలర్ కు ప్రతిగా 70 రూపాయల దిశగా పతనమవుతోంది. దీని ప్రభావం విదేశీ మారకద్రవ్య నిల్వలపై పడే అవకాశం ఉంది. అలాగే డాలర్ బలం పుంజుకోవడం కూడా విదేశీ మదుపదుపరులు తమ పెట్టుబడులను దేశీ మార్కెట్ల నుంచి తరలివెళ్లేందుకు కారణమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...