Stock Market : భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు... భయపెడుతున్న చమురు సెగలు...

మార్చి క్వార్టర్ ఎర్నింగ్స్‌లో మిశ్రమ ఫలితాలు , అలాగే పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్లో అమ్మకాలకు దోహదం చేశాయి. రూపీ పతనంతో ఐటీ స్టాక్స్ లో మాత్రం కొనుగోళ్ల మద్దతు కనిపించింది. నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 0.64 శాతం లాభపడింది.

news18-telugu
Updated: April 22, 2019, 4:24 PM IST
Stock Market : భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు... భయపెడుతున్న చమురు సెగలు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 22, 2019, 4:24 PM IST
రికార్డు రన్‌తో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు, సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో, సూచీలు భారీగా కరెక్షన్ కు గురయ్యాయి. నిఫ్టీ 11600 పాయింట్ల దిగువన ముగిసింది. అలాగే సెన్సెక్స్ సైతం 500 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. నిఫ్టీ క్లోజింగ్ సమయానికి 158.30 పాయింట్లు నష్టపోయిన 11594.50 పాయింట్ల వద్ద నెగిటీవ్ గా క్లోజవగా, సెన్సెక్స్ 495.10 పాయింట్లు నష్టపోయి 38645.18 పాయింట్ల వద్ద నెగిటీవ్ గా క్లోజయ్యింది. మరో కీలక సూచీ బ్యాంక్ నిఫ్టీ 535 పాయింట్లు నష్టపోయి 29688 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్, బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐఓసీ లూజర్లుగా నిలిచాయి. అలాగే భారతీ ఎయిర్ టెల్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ స్టాక్స్ మాత్రం టాప్ గెయినర్లుగా నిలిచాయి. సెక్టార్ పరంగా చూస్తే ఐటీ మినహా అన్ని సెక్టార్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఆటో, మెటల్, ఫార్మా, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు నెగిటివ్ గా ముగిసాయి.

మార్చి క్వార్టర్ ఎర్నింగ్స్‌లో మిశ్రమ ఫలితాలు , అలాగే పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్లో అమ్మకాలకు దోహదం చేశాయి. రూపీ పతనంతో ఐటీ స్టాక్స్ లో మాత్రం కొనుగోళ్ల మద్దతు కనిపించింది. నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 0.64 శాతం లాభపడింది. టీసీఎస్, విప్రో, మైండ్ ట్రీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర లాంటి స్టాక్స్ లాభాల్లో ముగియడం విశేషం.

First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...