STOCK MARKET BENCHMARK INDICES ENDED ON POSITIVE NOTE ON JULY 26 BREAKING SIX CONSECUTIVE DAY FALL MK
Stock Market : స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...ఆటో స్టాక్స్‌లో జోష్...
ప్రతీకాత్మక చిత్రం
స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు పాజిటివ్ గా ముగిశాయి. అయినప్పటికీ నిఫ్టీ 11300 దిగువన ముగిసింది. సెన్సెక్స్ 51.81 పాయింట్లు లాభపడి 37,882.79 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 32.10 పాయింట్లు లాభపడి 11,284.30 పాయింట్ల వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. వరుసగా ఆరు సెషన్లుగా భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు పాజిటివ్ గా ముగిశాయి. అయినప్పటికీ నిఫ్టీ 11300 దిగువన ముగిసింది. సెన్సెక్స్ 51.81 పాయింట్లు లాభపడి 37,882.79 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 32.10 పాయింట్లు లాభపడి 11,284.30 పాయింట్ల వద్ద ముగిసింది.
ముఖ్యంగా ఎస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్ నిఫ్టీలో మేజర్ గెయినర్స్ గా నిలవగా, వేదాంత, ఐవోసీ, హెచ్ డీఎఫ్ సీ, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. సెక్టార్స్ పరంగా చూస్తే ఎనర్జీ, ఐటీ మినహా దాదాపు అన్ని సెక్టార్స్ లాభాల్లో ముగిసాయి. నిఫ్టీ ఆటో సూచీ 2 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.1 శాతం, ఫార్మా 1 శాతం లాభపడ్డాయి. అలాగే ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, మెటల్ స్టాక్స్ సైతం లాభాల్లో ముగిసాయి. ఇక బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీల సైతం స్వల్ప లాభాల్లో ముగిసాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.