Home /News /business /

STOCK MARKET BENCHMARK INDICES ENDED LOWER FOR THE FOURTH CONSECUTIVE DAY MK

Stock Market | వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Stock Market | మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 48.39 పాయింట్లు నష్టపోయి37,982.74 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 15.20 పాయింట్లు నష్టపోయి 11,331 పాయింట్ల వద్ద ముగిసింది.

    బెంచ్ మార్క్ సూచీలు వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టాలు మూటగుట్టుకున్నాయి. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 48.39 పాయింట్లు నష్టపోయి37,982.74 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 15.20 పాయింట్లు నష్టపోయి 11,331 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కీలకమైన 11350 పాయింట్ల దిగువన ముగియగా, సెన్సెక్స్ 38 వేల పాయింట్ల దిగువన ముగిసింది. సెక్టార్ పరంగా చూసినట్లయితే నిప్టీ బ్యాంక్ సైతం 0.54 శాతం నష్టపోయి నెగిటివ్ గా ముగిసింది. బ్యాంకింగ్ స్టాక్స్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఏకంగా -1.47 శాతం నష్టపోయి ప్రధాన సూచీలను భారీగా నెగిటివ్ కంట్రిబ్యూటర్ గా నిలిచింది. అలాగే ఎస్ బీఐ -2.47 శాతం, ఆర్ బీఎల్ బ్యాంక్ -2.27 శాతం నష్టపోయాయి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం -5.66 శాతం నష్టపోయింది. దీంతో పాటు మరో ప్రభుత్వం బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా గరిష్టంగా -4.94 శాతం నష్టపోయింది.

    ఇక మిగితా సెక్టార్స్ విషయానికి వస్తే నిఫ్టీ ఫార్మా సూచీ -0.7 శాతం నష్టపోయింది. ఫార్మా స్టాక్స్ లో అరబిందో ఫార్మా -1.47 శాతం, బయాకాన్ -1.85 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ -1.26 శాతం శాతం నష్టపోయాయి. ఇక ఆటో స్టాక్స్ సైతం నష్టాలను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా అశోక్ లేల్యాండ్ -5.48 శాతం నష్టపోగా, మారుతి సుజుకి -0.66 శాతం నష్టపోయింది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో మాత్రం కొనుగోళ్లు సందడి కనిపించింది. ఐటీసీ +2.36 శాతం, హిందుస్తాన్ యూనిలివర్ +0.76 శాతం లాభపడ్డాయి.

    సూచీలను ప్రధానంగా నష్టపరిచిన స్టాక్స్ విషయానికి వస్తే ఎస్బీఐ -2.47 శాతం నష్టపోయి టాప్ లూజర్ గా నిలిచింది. అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్ డీఎఫ్ సీ -2.21 శాతం నష్టపోగా, అదానీ పోర్ట్స్ -1.83 శాతం నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచారు. అలాగే టాప్ గెయినర్స్ విషయానికి వస్తే పవర్ గ్రిడ్ కార్పోరేషన్ +3.11 శాతం, హీరో మోటా కార్ప్ +2.73 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ +2.73 శాతం, ఐటీసీ +2.36 శాతం, ఏషియన్ పెయింట్స్ +1.79 శాతం లాభపడ్డాయి. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి దాదాపు 250 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. ఇందులో ఎం అండ్ ఎం, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్, అశోక్ లేల్యాండ్, టీవీఎస్ మోటార్స్, అపోలో టైర్స్, ఎండ్యురన్స్ టెక్నాలజీ లాంటి సంస్థలు ఉన్నాయి.

    stock market live, stock market today, stock market latest news, bse sensex, nifty, స్టాక్ మార్కెట్, బడ్జెట్, బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ
    52 వారాల కనిష్టాన్ని తాకిన స్టాక్స్ ఇవే...
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Sensex, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు