Steel,Cement Rates Rise : సొంతింటి కల రోజురోజుకీ ఖరీదయిపోతోంది. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇటీవల కాలంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సిమెంట్, స్టీల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి మొదలు కానుండటం, మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా అంత ప్రమాదకరంగా లేకపోవడంతో చాలాచోట్ల నిర్మాణ రంగంలో కొంత కదలిక మొదలైంది. సొంతిళ్లతో పాటు అపార్టుమెంట్ల నిర్మాణాలూ ప్రారంభమవుతున్నాయి. ఈ డిమాండును సొమ్ము చేసుకునేందుకు ఉక్కు, సిమెంటు ఉత్పత్తిదారులు భారీగా ధరలు పెంచేస్తున్నారు. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. సొంతింటి కల రోజురోజుకీ ప్రియంగా మారుతోందని వాపోతున్నారు.
గడిచిన రెండు వారాల్లో స్టీల్ ధరలు అయితే విపరీతంగా పెరిగాయి. టన్నుకు రూ. 10 వేల నుంచి 11 వేలు పెరిగింది. మరోవైపు సిమెంట్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. సిమెంటు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన కొత్త ధరలు ప్రకటిస్తాయి. ఫిబ్రవరిలో 1న పెంచి.. మళ్లీ రెండు రోజులకే మరోసారి పెంచేశాయి కంపెనీలు. కొన్ని ప్రముఖ బ్రాండ్ల 50 కిలోల బస్తా ధరలు రెండు వారాల్లో రూ.40-50 వరకు పెరిగాయి.
ALSO READ PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు వచ్చేది అప్పుడే.. ఫిర్యాదులు ఉంటే ఇలా చేయండి
డిమాండు బాగుండటంతో ఉక్కు, సిమెంటు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ రంగాల నిపుణులు చెబుతున్నారు. ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్, కోల్ ధరలు పెరగడంతో ఉక్కు ఉత్పత్తుల ధరలు పెరిగాయని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. అయితే డిమాండే అసలు కారణమని నిర్మాణరంగ నిపుణులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cement, House, Vizag Steel Plant