Lakshmi Mittal : స్టీల్ అధినేత లక్ష్మీమిట్టల్ సోదరుడు అరెస్ట్... ఎందుకంటే...

Pramod Mittal : అధికారాన్ని అడ్డదారులు తొక్కించి, ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ప్రమోద్ మిట్టల్‌పై ఆరోపణలు వచ్చాయి. అవి రుజువైతే 45 ఏళ్ల జైలు శిక్ష తప్పదు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 24, 2019, 2:06 PM IST
Lakshmi Mittal : స్టీల్ అధినేత లక్ష్మీమిట్టల్ సోదరుడు అరెస్ట్... ఎందుకంటే...
ప్రమోద్ మిట్టల్
  • Share this:
స్టీల్ రారాజు లక్ష్మీ మిట్టల్ చిన్న తమ్ముడైన ప్రమోద్ మిట్టల్‌ను బోస్నియా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమోద్ మిట్టల్... GIKILలో సూపర్‌వైజరీ బోర్డుకి హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. అది బోస్నియాలోని అతిపెద్ద ఎగుమతి సంస్థల్లో ఒకటిగా ఉంది. ప్రమోద్ మిట్టల్‌తోపాటూ... GIKIL జనరల్ మేనేజర్ పరమేష్ భట్టాచార్య, సూపర్వైజరీ బోర్డ్ సభ్యుడు రజిప్ దాష్ కూడా అరెస్టైనట్లు ప్రాసిక్యూటర్ కాజిమ్ సెర్హాట్లిక్ తెలిపారు. చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డదారులు తొక్కించి, మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బోస్నియా పోలీసులు... స్టీల్ మాగ్నెట్ లక్ష్మీ మిట్టల్ తమ్ముడు ప్రమోద్ మిట్టల్‌ను అరెస్ట్ చేశారు. ఇది ఈశాన్య పట్టణం ల్యూకావాక్‌లోని కోకింగ్ ప్లాంట్‌కి సంబంధించిన కేసు. ఈ ప్లాంట్‌కి 2003 నుంచీ ప్రమోద్ మిట్టల్ కో-మేనేజర్‌గా ఉన్నారు. ఇందులో 1000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రాసిక్యూటర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు... GIKIL సూపర్వైజరీ బోర్డ్ ప్రెసిడెంట్‌ ప్రమోద్‌మిట్టల్‌ను అరెస్టు చేశారు. GIKILను 2003లో స్థాపించారు. దీనికి ప్రమోద్ మిట్టల్‌కు చెందిన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్స్ కంపెనీ... సహ నిర్వాహణ చేస్తోంది.

ప్రమోద్ మిట్టల్, మరో ఇద్దరు కలిసి... వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీళ్లంతా కలిసి... రూ.19 కోట్లను పక్కదారి మళ్లించారని తెలిసింది. ఇందులో నేరం రుజువైతే... దోషులకు 45 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. ఇందులో పాలుపంచుకున్నట్లు అనుమానం ఉన్న నాలుగో వ్యక్తి కోసం అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. నలుగురిలోకీ ప్రధాన సూత్రధారిగా ప్రమోద్ మిట్టల్‌ని చెబుతున్నారు.

ప్రపంచ స్టీల్ దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిట్టల్‌కి CEOగా వ్యవహరిస్తున్న లక్ష్మీ మిట్టల్... తన తమ్ముణ్ని బెయిల్‌పై బయటకు తెప్పించుకున్నారు. బల్కాన్స్‌లో ప్రమోద్ మిట్టల్‌కి చాలా కంపెనీలు ఉన్నాయి.

First published: July 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>