Home /News /business /

STATE BANK OF INDIAS SAVINGS DEPOSIT SCHEMES KNOW WHICH IS BEST INVESTMENT OPTION FOR YOU SS

SBI Schemes: ఎస్‌బీఐలో డిపాజిట్ స్కీమ్స్... ఎక్కువ వడ్డీ ఇలా పొందొచ్చు

SBI BSBD Account: మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఎస్‌బీఐలో అకౌంట్

SBI BSBD Account: మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఎస్‌బీఐలో అకౌంట్

SBI Schemes | నెలకు కొంత పొదుపు చేయాలనుకునేవారికి రికరింగ్ డిపాజిట్ సరైన ఆప్షన్. వడ్డీ కూడా లభిస్తుంది. మీరు నెలకు కనీసం రూ.100 పొదుపు చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు.

    మీరు డబ్బులు పొదుపు చేయాలనుకుంటున్నారా? రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనేక డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి పీపీఎఫ్ వరకు అనేక పథకాలున్నాయి. ఒక్కో స్కీమ్‌కు ఒక్కోలా వడ్డీ రేట్లు ఉంటాయి. ఎందులో ఇన్వెస్ట్ చేసినా రిస్క్ ఉండదు. రిటర్న్స్ తక్కువైనా మీ డబ్బుకు ఢోకా ఉండదు. మీరు ఎంచుకునే స్కీమ్‌ను బట్టి 5.75 నుంచి 8.7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఆ పథకాలు ఇవే. మరి ఏ పథకం మీకు బెస్ట్ ఆప్షనో తెలుసుకోండి.

    1. ఫిక్స్‌డ్ డిపాజిట్(FD): ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో మీరు ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు రూ.2 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75-6.85 శాతం వడ్డీ లభిస్తుంది. వృద్ధులకు 6.25-7.35 వడ్డీ లభిస్తుంది.

    Read this: Redmi 7: షావోమీ నుంచి మరో ఫోన్... చైనాలో రిలీజైన రెడ్‌మీ 7

    2. రికరింగ్ డిపాజిట్(RD): నెలకు కొంత పొదుపు చేయాలనుకునేవారికి రికరింగ్ డిపాజిట్ సరైన ఆప్షన్. వడ్డీ కూడా లభిస్తుంది. మీరు నెలకు కనీసం రూ.100 పొదుపు చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. 12 నెలల నుంచి 120 నెలల వరకు ఆర్‌డీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిక్స్‌ డిపాజిట్ అకౌంట్‌కు వచ్చే వడ్డీనే రికరింగ్ డిపాజిట్‌కు లభిస్తుంది.

    3. నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS): 18 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు ఎవరైనా నేషనల్ పెన్షన్ స్కీమ్‌ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. రిటర్న్స్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి.

    Read this: WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...

    4. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF): ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్ పీపీఎఫ్. ఏడాదికి రూ.500 నుంచి రూ.1,50,000 వరకు ఎస్‌బీఐ పీపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు దాచుకోవచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా నెలనెలా పొదుపు చేయొచ్చు. ప్రస్తుతం వడ్డీ 8.0 శాతం ఉంది. వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

    5. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS): వృద్ధులు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుల్ని దాచుకోవడానికి ఉపయోగపడే అకౌంట్ ఇది. రూ.1,000 నుంచి రూ.15 లక్షల వరకు ఎంతైనా దాచుకోవచ్చు. వడ్డీ రేటు వార్షికంగా 8.7 శాతం లభిస్తుంది.

    Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్

    ఇవి కూాడా చదవండి:

    Realme 3 Flash Sale: రియల్‌మీ 3 మరో ఫ్లాష్ సేల్... ఆఫర్లు, ఫీచర్లు ఇవే...

    IRCTC Apps: ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ మీ దగ్గరున్నాయా? వాటి ఉపయోగాలు ఇవే...

    Tax Saving: ఇన్స్యూరెన్స్ పాలసీతో ట్యాక్స్ ఆదా... ఇలా చేయొచ్చు
    First published:

    Tags: Income tax, Investment Plans, ITR, Personal Finance, Sbi, TAX SAVING

    తదుపరి వార్తలు