SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్‌బీఐ

SBI Revamped Gold Deposit Scheme | R-GDS స్కీమ్‌‌లో ఎవరైనా కనీసం 30 గ్రాముల బంగారాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. బంగారం బిస్కెట్లు, నగల రూపంలో బంగారాన్ని దాచుకోవచ్చు.

news18-telugu
Updated: March 9, 2019, 9:26 AM IST
SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్‌బీఐ
SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 9, 2019, 9:26 AM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టి చాలాకాలమైంది. కానీ ఈ స్కీమ్‌ గురించి తెలిసినవాళ్లు తక్కువే. మామూలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే మీ దగ్గరున్న డబ్బును డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ వస్తుంది. అలాంటిదే గోల్డ్ స్కీమ్ కూడా. మీ దగ్గర అవసరం లేకుండా ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ పొందొచ్చు. అదే రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్(R-GDS). ఈ స్కీమ్‌లో ఎవరైనా బంగారాన్ని డిపాజిట్ చేయొచ్చు. మరి R-GDS స్కీమ్‌ గురించి, దాని వల్ల మీకు వచ్చే లాభాలేంటో తెలుసుకోండి.

Read this: LIC Alert: మోసపోతారు జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎల్ఐసీ

SBI Revamped Gold Deposit Scheme, SBI R- GDS, SBI Gold Deposit Scheme, SBI Gold Scheme, SBI Gold Fixed Deposit, Gold investment, Gold investment ideas, ఎస్‌బీఐ రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఎస్‌బీఐ గోల్డ్ స్కీమ్
ప్రతీకాత్మక చిత్రం


R-GDS స్కీమ్‌ వివరాలివే...




ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం R-GDS స్కీమ్‌‌లో ఎవరైనా కనీసం 30 గ్రాముల బంగారాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. బంగారం బిస్కెట్లు, నగల రూపంలో బంగారాన్ని దాచుకోవచ్చు. ఈ స్కీమ్ మూడు రకాలుగా ఉంటుంది.

1. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD): 1-3 ఏళ్ల కాలవ్యవధి. ఇందులో ఏడాదికి 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల వరకు 0.55 వడ్డీ, 2-3 ఏళ్ల వరకు 0.60 శాతం వడ్డీ పొందొచ్చు.

2. మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD): 5-7 ఏళ్ల కాలవ్యవధి. ఇందులో వార్షికంగా 2.25 శాతం వడ్డీ పొందొచ్చు.
Loading...
3. లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (LTGD): 12-15 ఏళ్ల కాలవ్యవధి. ఇందులో వార్షికంగా 2.5 శాతం వడ్డీ పొందొచ్చు.

Read this: Paytm First: అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా 'పేటీఎం ఫస్ట్'... ఇలా సబ్‌స్క్రైబ్ చేసుకోండి

SBI Revamped Gold Deposit Scheme, SBI R- GDS, SBI Gold Deposit Scheme, SBI Gold Scheme, SBI Gold Fixed Deposit, Gold investment, Gold investment ideas, ఎస్‌బీఐ రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఎస్‌బీఐ గోల్డ్ స్కీమ్
ప్రతీకాత్మక చిత్రం


ఈ స్కీమ్‌లో వచ్చే వడ్డీని మార్చి 31న లేదా మెచ్యూరిటీ తర్వాత పొందొచ్చు. R-GDS స్కీమ్‌‌లో ఇప్పటివరకు ఎస్‌బీఐ చెల్లించిన వడ్డీ వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

SBI Revamped Gold Deposit Scheme, SBI R- GDS, SBI Gold Deposit Scheme, SBI Gold Scheme, SBI Gold Fixed Deposit, Gold investment, Gold investment ideas, ఎస్‌బీఐ రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఎస్‌బీఐ గోల్డ్ స్కీమ్
image: SBI


షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD) స్కీమ్‌లో ఒక ఏడాది, మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD) స్కీమ్‌లో మూడేళ్లు, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (LTGD) స్కీమ్‌లో ఐదేళ్లు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. లాక్-ఇన్ పీరియడ్ తర్వాత ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. పిల్లల పెళ్లిళ్ల కోసమో, లేదా పెట్టుబడి రూపంలోనో ఇంట్లో బంగారం దాచుకున్న వారికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది.

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇవి కూడా చదవండి:

Video: ప్రాణాలు కాపాడిన పోలీస్ ఆఫీసర్‌... హగ్ ఇచ్చిన డాగ్

2019 Smartphones: రూ.15,000 లోపు టాప్-5 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

IRCTC App: నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న 'రైల్ కనెక్ట్ యాప్‌'... టాప్ 10 ఫీచర్లు ఇవే...
First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...