ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త!

ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గిఫ్టింగ్, జ్యువెలరీ, ఫర్నీచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ... ఇలా ఏదైనా సరే యోనో యాప్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగిస్తే 10 శాతం డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

news18-telugu
Updated: October 15, 2018, 1:43 PM IST
ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త!
image: SBI
news18-telugu
Updated: October 15, 2018, 1:43 PM IST
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్లా? మీ దగ్గర ఎస్‌బీఐకి చెందిన యోనో(యూ ఓన్లీ నీడ్ వన్) యాప్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ లభించనున్నాయి. అక్టోబర్ 16 నుంచి 21 వరకు షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది ఎస్‌బీఐ. డిజిటల్ షాపింగ్ ఫెస్టివల్‌లోకి వచ్చిన తొలి బ్యాంక్ ఎస్‌బీఐ కావడం విశేషం.

అసలేంటి ఈ షాపింగ్ ఫెస్టివల్?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ సైట్స్ తరచూ ఫెస్టివల్ సేల్స్ నిర్వహిస్తుంటాయి. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా అలాగే సేల్ నిర్వహించబోతోంది. అయితే ఈ యాప్ ద్వారా ఏకంగా 85 ఇ-కామర్స్ సంస్థల్లో షాపింగ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గిఫ్టింగ్, జ్యువెలరీ, ఫర్నీచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ... ఇలా ఏదైనా సరే యోనో యాప్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగిస్తే 10 శాతం డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్, జబాంగ్, మింత్రా, కళ్యాణ్, క్యారట్ లేన్, పీసీజీ, పెప్పర్ ఫ్రై, ఓయో, టాటా క్లిక్, యాత్ర, ఈజ్ మై ట్రిప్, ఫస్ట్ క్రై, ఐజీపీ ఫెర్న్స్ అండ్ పెటల్స్ లాంటి సంస్థలన్నీ ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నాయి.

2017 నవంబర్‌లో లాంఛైన యోనో ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం 30 లక్షల మంది యూజర్లున్నారు. ప్రతీరోజు 25,000 మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరుతున్నారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో యోనో యాప్ ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ కూడా సులువే. ఇక ప్రీ అప్రూవ్డ్ లోన్స్‌ని ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా పొందొచ్చు.



ఇవి కూడా చదవండి:

ఆఫ్‌లైన్ స్టోర్లల్లో షావోమీ పోకో ఎఫ్1 సేల్!

త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 6 ప్రో రిలీజ్!
Loading...
నాలుగు కెమెరాలతో సాంసంగ్ గెలాక్సీ ఏ9

ఫోర్ట్‌నైట్ గేమ్: మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

బనానా ఫోన్(నోకియా 8110) రిలీజ్ చేసిన నోకియా!

వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?

అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999
First published: October 15, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...